Ajit Pawar: 11వ క్లాసు వరకు ప్యాంటే వేసుకోలేదు.. గుడిలో డ్రెస్ కోడ్‭పై అజిత్ పవార్ హాట్ కామెంట్స్

కొన్ని దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి వెళ్లే వరకు చిన్నపిల్లలకు పూర్తి ప్యాంట్‌లను కొనుగోలు చేయలేదు. మేము పాఠశాలలో ఉన్నప్పుడు 10వ తరగతి పూర్తయ్యే వరకు ప్యాంటు ధరించలేదు. చిన్నపాటి నిక్కర్లతోనే పాఠశాలకు వెళ్లాము

Ajit Pawar: 11వ క్లాసు వరకు ప్యాంటే వేసుకోలేదు.. గుడిలో డ్రెస్ కోడ్‭పై అజిత్ పవార్ హాట్ కామెంట్స్

Ajit Pawar

Ajit Pawar – Tuljapur Temple Trust : గుడిలోకి వచ్చేవారు పొట్టి దుస్తులు ధరించకూడదంటూ తుల్జాపూర్ ఆలయ ట్రస్ట్‌ జారీ చేసిన ఆదేశాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను 11వ తరగతికి వచ్చే వరకు ప్యాంటే ధరించలేదని, అలాంటిది ఇప్పుడు కొత్తగా ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. చిన్న పిల్లల పొట్టి బట్టల్ని సైతం అసభ్యకరమైన దుస్తులు అంటూ తుల్జాపూర్ ఆలయ ట్రస్ట్‌ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. కొత్త సమస్యలను సృష్టించే అటువంటి ఉత్తర్వులను జారీ చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.

2000 note: కరెన్సీ నోటు టాయిలెట్ పేపర్ అవుతోంది.. 2000 నోట్ల రద్దుపై మహువా

‘‘కొన్ని దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి వెళ్లే వరకు చిన్నపిల్లలకు పూర్తి ప్యాంట్‌లను కొనుగోలు చేయలేదు. మేము పాఠశాలలో ఉన్నప్పుడు 10వ తరగతి పూర్తయ్యే వరకు ప్యాంటు ధరించలేదు. చిన్నపాటి నిక్కర్లతోనే పాఠశాలకు వెళ్లాము. మేము 11వ తరగతిలో ప్రవేశించిన తర్వాతే మాకు ఫుల్ ప్యాంటు ఇస్తామని మా తల్లిదండ్రులు చెప్పేవారు. ఇది మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. అలాంటప్పుడు చిన్న పిల్లలను దేవాలయాల్లోకి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? తన దర్శనానికి పొట్టి దుస్తులు ధరించిన పిల్లలను రానివ్వవద్దని ఏ దేవుడైనా చెప్పాడా? అని పూణెలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు.

Karnataka: సీఎం ప్రమాణ స్వీకారోత్సవం.. దేశంలోని విపక్షాల ఐక్యతను, బలాన్ని ప్రదర్శించారా? విఫలమయ్యారా?

రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవానీ ఆలయ నిర్వాహకులు ఇటీవల హాఫ్ ప్యాంట్ లేదా “అసభ్యకరమైన” బట్టలు ధరించి వచ్చే భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే కొన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ చర్య మతపరమైన ప్రదేశం పవిత్రతను కాపాడటం లక్ష్యంగానే సదరు ఆదేశాలు ఇచ్చిన్లు తుల్జాపూర్ ఆలయ ట్రస్ట్‌ పేర్కొంది.