I-T Survey On BBC: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. ప్రతిపక్షాల ఆగ్రహం

ఈ సోదాల సందర్భంగా బీబీసీ అధికారుల మొబైల్ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధికారులు ఎవ్వరినీ ఆఫీసు నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. బీబీసీ ఆఫీసుల్లోని అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కంప్యూటర్లను తనిఖీ చేయడం ద్వారా పన్ను ఎగవేత గురించి కూడా తెలుసుకునేందుకు ఐటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

I-T Survey On BBC: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. ప్రతిపక్షాల ఆగ్రహం

I-T Survey On BBC: దేశంలోని బీబీసీ ప్రధాన కార్యాలయాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

US : అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి

ఈ సోదాల సందర్భంగా బీబీసీ అధికారుల మొబైల్ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధికారులు ఎవ్వరినీ ఆఫీసు నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. బీబీసీ ఆఫీసుల్లోని అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కంప్యూటర్లను తనిఖీ చేయడం ద్వారా పన్ను ఎగవేత గురించి కూడా తెలుసుకునేందుకు ఐటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. బీబీసీ బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ అనే సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఇటీవలే మోదీకి వ్యతిరేకంగా, 2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ కొశ్చన్’ అనే పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే దీన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇది దేశంలో రాజకీయ రగడకు దారితీసింది.

MP Komatireddy Venkat Reddy : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

ఈ విషయంలో బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మరోవైపు ఐటీ అధికారులు తాము సోదాలు చేయడం లేదని, సర్వే మాత్రమే చేస్తున్నామని తెలిపారు. అయితే, ఈ ఐటీ సోదాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీతోపాటు అనేక పార్టీలు కేంద్రంలోని బీజేపీని తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ ‘మేము అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి, విచారణ జరపాలని డిమాండ్ చేస్తే బీజేపీ మాత్రం బీబీసీపై దాడులు చేస్తోంది’’ అని విమర్శించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ ఎంపీ మౌహా మొయిత్రా వంటి ప్రతిపక్ష నేతలు కూడా బీబీసీపై దాడుల్ని తప్పుబడుతున్నారు.