Red Gram Husk: కంది పొట్టులో పాలకంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం .. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇక్రిశాట్ పరిశోధకులు

కల్షియం మన శరీరానికి సరిపడా దొరకాలంటే మనం పాలు, బాదం, తదితర వంటిని ఎక్కువగా తీసుకుంటాం. తాజాగా హైదరాబాద్‌లోని ఇక్రీశాట్ పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. కందులపై ఉండే పొర (పొట్టు)లో పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్నట్లు గుర్తించారు.

Red Gram Husk: కంది పొట్టులో పాలకంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం .. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇక్రిశాట్ పరిశోధకులు

Red Gram

Red Gram Husk: ఐరన్, విటమిన్ – డి వంటి సూక్ష్మ పోషకాల మాదిరిగా కాల్షియం కూడా మన శరీరంకు ఎంతో అవసరం. శరీర ఎముకలు, కండరాలతో పాటు నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కాల్షియం సహాయపడుతుంది. అయితే కల్షియం మన శరీరానికి సరిపడా దొరకాలంటే మనం పాలు, బాదం, తదితర వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటాం. తాజాగా హైదరాబాద్‌లోని ఇక్రీశాట్ పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. కందులపై ఉండే పొర (పొట్టు)లో పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్నట్లు గుర్తించారు. కంది పప్పును పొట్టుతో సహా ఆహారంగా తీసుకుంటే పెద్దల్లో ఎముకలు పెలుసుబారడాన్ని, చిన్న పిల్లల్లో ఎముకలు మెత్తబడే రికెట్స్ వ్యాధిని అరికట్టొచ్చని పరిశోధకులు తెలిపారు. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే కల్షియ లోపం తలెత్తదని పేర్కొంటున్నారు.

Calcium : రోజుకు వయస్సుల వారిగా ఎవరికెంత కాల్షియం శరీరానికి అవసరమంటే?

ఇక్రీశాట్ పరిశోధకుల వివరాల ప్రకారం.. 100 గ్రాముల కందుల పొట్టులో 625 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుందని, 100 మిల్లీ లీటర్ల పాలలో 120 ఎంజీ కాల్షియం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దీనికితోడు ఫార్మా కంపెనీలుసైతం ఫుడ్ సప్లిమెంట్లుగా కందిపొట్టును వాడొచ్చని ఇక్రిశాట్ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఫలితాలను ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) పీర్-రివ్యూడ్ జర్నల్ సస్టైనబిలిటీలో ప్రచురించింది. కంది గింజ పరిమాణంలో దానిపై ఉండే పొట్టు 10శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ అనంతరం ఈ పొట్టును వృథాగా పడేస్తుంటారు. లేదంటే పశువులకు ఆహారంగా వాడుతారు.

2019- 2020 వర్షాలం సీజన్ లో ఇక్రిశాట్ ప్రాంగణంలో పండించిన 60 రకాల కందులపై జెనీబ్యాంక్ బృందం పరిశోధనలు చేసింది. ప్రతి మనిషికి రోజుకు 800 ఎంజీ నుండి 1000 ఎంజీ కాల్షియం అవసరం. కానీ భారతీయులకు వారి ఆహారం నుండి తగినంత కాల్షియం లభించదు. దీంతో ఇక్రిసాట్ జెనీబ్యాంక్ ఆహార పదార్థాల్లో పోషకాలు ఎంత మేరకు ఉన్నాయో పరిశోధనలు నిర్వహించింది. బియ్యం, తవుడు, గోధుమ ఊక, ఓట్ ఊకతో పోల్చితే కంది గింజలపై పొరలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు. ఔషధాల రూపంలో తీసుకునే సూక్ష్మపోషకాలతో పోలిస్తే.. మొక్కలు అందించే సూక్ష్మపోషకాలు శరీరానికి బాగా ఉపయోగపడతాయని ఇక్రిసాట్ జెన్‌బ్యాక్ హెడ్ డాక్టర్ కులదీప్ సింగ్ అన్నారు.