India COVID 19 : గుడ్ న్యూస్! తగ్గుతున్న కేసులు.. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 వేల 041 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా..276 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 29 వేల 621 మంది కోలుకున్నారు.

India COVID 19 : గుడ్ న్యూస్! తగ్గుతున్న కేసులు.. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది

India Covid

India Covid 19 : భారతదేశంలో కరోనా తోకముడుస్తోందా ? అంటే నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే…అవును అనిపిస్తోంది. ఎందుకంటే క్రమక్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా కరోనా విలయతాండవం చేసిన సంగతి తెలిసేందే.

Read More : Almond Tea : బాదం టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా!..

ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోయారు. ఈ క్రమంలో..గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 వేల 041 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా..276 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786కి పెరిగగా..మరణాల సంఖ్య 4,47.194కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనా నుంచి 29 వేల 621 మంది కోలుకున్నారు. మొత్తం వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 3,29,31,972కి చేరింది.

Read More : Delhi : భారత్ బంద్, ఢిల్లీ – గుర్‌గ్రామ్ భారీ ట్రాఫిక్ జాం, ఎక్కడి వాహనాలు అక్కడే

దేశంలో 2,99,620 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధిక భాగం కేరళ రాష్ట్రానివే. కేరళలో 15 వేల 951 కేసులు నమోదు అయితే…165 మంది చనిపోయారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 86,01,59,011 డోసులు పంపిణీ చేయడం జరిగిందని కేంద్రం వెల్లడించింది. 24 గంటల్లో 38,18,362 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపింది.