మే నెలలో భారతీయులు గూగుల్ లో ఏం వెతికారో తెలుసా!

  • Published By: venkaiahnaidu ,Published On : June 8, 2020 / 01:26 PM IST
మే నెలలో భారతీయులు గూగుల్ లో ఏం వెతికారో తెలుసా!

గూగుల్ లో కరోనా వ్యాక్సిన్ సంబంధిత విషయాల కోసం వెతికేవాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోయిందని గూగూల్ కంపెనీ సోమవారం వెల్లడించింది. వ్యాక్సిన్ సంబంధిత శోధనలు కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని, భారతదేశంలో మే నెలలో 190 శాతానికి పైగా వ్యాక్సిన్ సంబంధిత విషయాల గురించి సెర్చ్ చేసేవాళ్లు పెరిగారని గూగుల్ తెలిపింది.

భారత్ లో మొత్తం మే నెలలో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 12 టాపిక్ గా కరోనా వైరస్ నిలిచిందని తెలిపింది. ఫిల్మ్,మీనింగ్,న్యూస్ అండ్ వెదర్ వంటివి ఎక్కువమంది సెర్చ్ చేసిన టాపిక్స్ గా ఉండగా,కరోనా వైరస్ స్థానం 12గా ఉందని గూగుల్ తెలిపింది. 

మొత్తం మే నెలలో “లాక్ డౌన్ 4.0” అనేది టాప్ ట్రెండింగ్ సెర్చ్ గా ఉందని, “ఈద్ ముబారక్”అనేది రెండవ టాప్ ట్రెండింగ్ టర్మ్ గా ఉండిందని గూగుల్ తెలిపింది. అంతేకాకుండా “కరోనావైరస్ లాక్ డౌన్ జోన్స్ ఢిల్లీ”, “ఇటలీ కరోనా వ్యాక్సిన్” అని మనవాళ్లు గూగుల్ సెర్చ్ లో తెగ వెతికేవారంట.