Indias Covid : భారత్ లో కరోనా సెకండ్ వేవ్, WHO తీవ్ర ఆందోళన

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Indias Covid : భారత్ లో కరోనా సెకండ్ వేవ్, WHO తీవ్ర ఆందోళన

Who

WHO : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..కరోనా తీవ్రతను అనుభవించాల్సిన రోజులు భవిష్యత్ లో ఉన్నాయని హెచ్చరించింది. ఈ సంవత్సరం సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా విజృంభించే అవకాశాలున్నాయని ప్రకటించింది. కరోనా తొలి ఏడాది కంటే రెండో ఏడాది..దారుణంగా ఉండే అవకాశం ఉందని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ వెల్లడించారు.

భారత్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఉధృతిని అడ్డుకొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకరిస్తోందని, ఇప్పటికే వేల సంఖ్యలో ఆక్సిజన్ కాన్స్ ట్రేటర్లు సరఫరా చేయడం జరిగిందన్నారు. మొబైల్ ఆసుపత్రులకు, టెంట్లు, మాస్క్ లు, ఇతర మెడికల్ సామాగ్రీని పంపించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఇండియాకు సహకరిస్తున్న ప్రపంచదేశాలకు ఆయన థాంక్స్ చెప్పారు.

Read More : COVID-19: ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో తగ్గు ముఖం పడుతున్న కరోనా