Congress On Gogoi Remarks : నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తానన్న గొగొయ్..పార్లమెంట్ కు అవమానమన్న కాంగ్రెస్

తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్‌లతో తనకు సంబంధం లేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ,ఎంపీ రంజన్‌ గొగొయి తెలిపారు. గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన గొగొయ్

Congress On Gogoi Remarks : నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తానన్న గొగొయ్..పార్లమెంట్ కు అవమానమన్న కాంగ్రెస్

Gogoi

Congress On Gogoi Remarks :  తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్‌లతో తనకు సంబంధం లేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ,ఎంపీ రంజన్‌ గొగొయి తెలిపారు. గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన గొగొయ్.. సమావేశాల హాజరు శాతం పదిలోపే ఉంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు.

ఈ విషయంపై ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంజన్‌ గొగొయి మాట్లాడుతూ…”నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. అసోం నుంచి వచ్చిన నేను ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై సభలో గళం విప్పాలనే భావించా. కానీ, కరోనా వ్యాప్తి.. డాక్టర్ల సూచనల మేరకు సమావేశాలకు హాజరుకావట్లేదు. ఈ మేరకు రాజ్యసభకు లేఖ కూడా పంపించాను. అయినా.. నాకు నచ్చినప్పుడు, నేను మాట్లాడాల్సిన అవసరం ఉందనిపిస్తేనే సభకు వెళ్తాను. నేను నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నికైన రాజ్యసభ స్వతంత్ర సభ్యుడిని. నన్ను ఏ పార్టీ ఆదేశించలేదు. నాకు నచ్చినప్పుడు వస్తా.. నచ్చినప్పుడు వెళ్తా. ఇంకా కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతూనే ఉంది. ఈ సమయంలో సామాజిక దూరం పాటించాల్సి ఉన్నా.. సభలో అది జరగట్లేదు. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ కూడా అసౌకర్యంగా ఉంది”అని అన్నారు.

అయితే గొగొయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నచ్చినప్పుడే రాజ్యసభకు వెళ్తా అంటూ గొగొయ్ చేసిన వ్యాఖ్యలు..పార్లమెంట్ కి అవమానం అని సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేష్ పేర్కొన్నారు. పార్లమెంట్ కేవలం మాట్లాడటానికి మాత్రమే వేదిక కాదని,వినేందుకు కూడా పార్లమెంట్ వేదిక అని జైరామ్ రమేష్ ఓ ట్వీట్ లో తెలిపారు.

ALSO READ Chittur Jawan Saiteja : సాయితేజ అంత్యక్రియలు, బరువెక్కిన జన హృదయం