J&K : కశ్మీర్‌‌లో 10 మంది స్లీపర్ సెల్స్ అరెస్టు

కశ్మీర్ లో 10 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. వీరందరూ ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ కు చెందిన వారుగా స్టేట్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. వీరిని

J&K : కశ్మీర్‌‌లో 10 మంది స్లీపర్ సెల్స్ అరెస్టు

Kashmir

State Investigation Agency : కశ్మీర్ లో 10 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. వీరందరూ ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ కు చెందిన వారుగా స్టేట్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్టేట్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. జైషే మొహమ్మద్ సంస్థకు ‘ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్’ (ఓజీడబ్ల్యూ)గా పని చేస్తున్నట్లు తేల్చారు. కశ్మీర్‌లోని వివిధ ప్రదేశాలలో రాత్రిపూట నిర్వహించిన రైడ్స్​లో స్లీపర్​ సెల్స్​ దొరికారని, దొరికిన 10 మందిలో ఒకరితో మరొకరికి సంబంధం లేదని అధికారులు తెలిపారు.

Read More : Kashmir Solidarity Day : హ్యుందాయ్ పాకిస్తాన్ కశ్మీర్ పోస్ట్‌పై భారత్‌ నుంచి విమర్శల వెల్లువ..!

జైషే సంస్థ టెర్రరిస్టు కమాండర్ల నుంచి వచ్చే సూచన ప్రకారం స్లీపర్ సెల్స్ నడుచుకుంటారని దర్యాప్తులో వెల్లడైంది. స్లీపర్ సెల్స్ యువకులను రిక్రూట్​ చేయడం, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణతో పాటు కశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో భాగంగా స్లీపర్ సెల్స్ నుంచి సెల్‌ఫోన్‌లు, సిమ్‌కార్డులు, బ్యాంకింగ్‌ రికార్డులు, డమ్మీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపించారు. 2020 ఏప్రిల్​లో హతమైన నలుగురు ఉగ్రవాదులకు చెందిన ఓ వ్యక్తి అరెస్ట్​ అయిన స్లీపర్ సెల్స్ లో ఉన్నారని అధికారులు తెలిపారు.

Read More : SSG Security Withdrawal : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కశ్మీర్‌లో నలుగురు మాజీ సీఎంలకు ఎస్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణ

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తరహాలో కొత్తగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) ఏర్పాటైంది. 2022, ఫిబ్రవరి 16వ తేదీ బుధవారం కశ్మీర్ లోయలో పలు దాడులు నిర్వహించింది. ఈ దాడులు ప్రధానంగా జెఎం నెట్ వర్క్ పై కేంద్రీకరించబడ్డాయి. అరెస్టు అయిన వీరు ఎక్కువగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నారని తెలిపారు. అరెస్టు అయిన వ్యక్తులను శ్రీనగర్ ఎన్ఐఏ కోర్టు ముందు హాజరు పరచనున్నారు. వీరిని కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేయనున్నారు.