సీఎం ఆదిత్యనాథ్ నిర్ణయానికి కంగనా సపోర్ట్..

  • Published By: vamsi ,Published On : September 15, 2020 / 12:59 PM IST
సీఎం ఆదిత్యనాథ్ నిర్ణయానికి కంగనా సపోర్ట్..

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యూజియం పేరు మార్చినందుకు సినీ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించి ఫడ్నవీస్, కంగనా సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.




ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం పేరును మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియంగా మారుస్తున్నట్లు ఆదిత్యనాథ్ ప్రకటించారు. బానిస మనస్తత్వాలకు చెందిన ఏ ఒక్క గుర్తులను.. రాష్ట్రంలో ఉంచటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే సీఎం యోగీ కీలక వ్యాఖ్యలు చేశారు..‘మొఘలాయిలు మన హీరోలుగా ఎందుకవుతారు? అంటూ తాజ్ మహల్ నిర్మించిన షాజహాన్‌ను ఉద్ధేశించి మాట్లాడారు.
https://10tv.in/kangana-ranaut-fan-arrested-in-kolkata-for-threatening-sanjay-raut/
అఖిలేష్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలలో చేర్చబడిన మొఘల్ మ్యూజియాన్ని ఇకపై ఛత్రపతి శివాజీగా పిలవబడుతుందని ఆయన నిర్ణయించారు. దీనిపై దేశవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వినపడుతుండగా.. యోగి ఆదిత్యనాథ్ చర్యను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసించారు. సిఎం యోగి చేసిన ట్వీట్‌ను ఫడ్నవీస్ రీట్వీట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో బానిసత్వ మనస్తత్వానికి స్థానం లేదని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కు నమస్కారం అంటూ ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.




ఇటీవలికాలంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శివసేన ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. లేటెస్ట్‌గా సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ఆగ్రాలోని మొఘల్ మ్యూజియంకు ఛత్రపతి శివాజీ మ్యూజియం అని పేరు పెట్టాలని సిఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయానికి కంగనా రనోత్ సపోర్ట్ చేశారు. కంగనా పూర్వీకులు శివాజీ మహారాజ్‌తో సంబంధం కలిగి ఉన్నారు.

యోగి ఆదిత్యనాథ్ ట్వీట్‌పై స్పందించిన కంగనా, తన పూర్వీకులకు శివాజీ మహారాజ్‌తో సంబంధం ఉందని, గొప్ప నాయకుడు బాలా సాహెబ్ ఠాక్రే పూర్వీకులు బీహార్ నుంచి వచ్చారని కంగనా రాశారు. తాజ్ మహల్ యొక్క తూర్పు ద్వారం సమీపంలో నిర్మిస్తున్న మొఘల్ మ్యూజియంలో మొఘల్ కాలంలో సాధించిన రాజకీయ మరియు సాంస్కృతిక విజయాలు కళాఖండాల ద్వారా ప్రదర్శించబడతాయి. సుమారు 52 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఈ మ్యూజియం నిర్మాణానికి సుమారు 20 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన ఈ మ్యూజియం నిర్మాణం 2019 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఇంకా ఇక్కడ పనులు జరుగుతున్నాయి.