Karnataka Election 2023 : కోట్లకు పడగలెత్తిన కర్ణాటక మంత్రిగారి ఆస్తులు .. చదివింది మాత్రం 9వ తరగతే

ఈ మంత్రిగారు చదివింది కేవలం 9వ తరగతే. కానీ ఆయన ఆస్తుల వివరాలు వింటే షాక్ అవ్వాల్సిందే. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఈ మంత్రిగారి ఆస్తులు వివరాలను వివరించారు.

Karnataka Election 2023 : కోట్లకు పడగలెత్తిన కర్ణాటక మంత్రిగారి ఆస్తులు .. చదివింది మాత్రం 9వ తరగతే

Karnataka Election 2023

Karnataka Election 2023 : కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో నేతలు దాఖలు చేసే అఫిడవిట్ లో వారి ఆస్తిపాస్తులు..చదువులకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తున్నారు. దీంట్లో భాగంగా కర్ణాటక మంత్రి ఎన్ నాగరాజు హొసకోటె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సోమవారం (ఏప్రిల్ 17,2023) దాఖలు చేశారు.

దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరుగా పరిగణించబడతున్న నాగరాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన హొసకోటె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ సందర్బంగా దాఖలుచేసిన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తి వివరాలను వెల్లడిస్తూ..తన పేరుమీద రూ.1,609 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించారు. నాగరాజుకు భార్య శాంతకుమారి పేరుతో రూ.536 కోట్ల చరాస్తులు, రూ.1,073 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని..దంపతుల పేరుతో రూ.98.36 కోట్ల రుణాలున్నాయని ప్రకటించారు. ఇక 72 ఏళ్ల నాగరాజు చదువు విషయానికొస్తే తాను 9వ తరగతి వరకే చదివానని పేర్కొన్నారు.

కాగా..2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున హొసకోటె అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీచేసి గెలిచారు. అప్పట్లో ఆయన తన ఆస్తులను రూ.1,120 కోట్ల ఆస్తులు ప్రకటించారు. తరువాత 2019లో జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణప్రభుత్వం కూలిపోవటంతో బీజేపీ అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన 17 మంది ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ తరపున గెలిచిన నాగరాజు కూడా ఉన్నారు. బీజేపీలో చేరిన తరువాత 2020 ఉప ఎన్నికల సమయంలో నాగరాజు సమర్పించిన అఫిడవిట్‌లోనూ రూ.1,220 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించారు.