కేజ్రీవాల్ మార్కు: సామాన్యుడికి అందుబాటులో స్కూల్ ఫీజులు

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 09:21 AM IST
కేజ్రీవాల్ మార్కు: సామాన్యుడికి అందుబాటులో స్కూల్ ఫీజులు

ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే ప్రైవేటు విద్య వ్యాపారాన్ని నియంత్రించవచ్చు . ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆ విషయం నిజం చేసి చూపింది. గడిచిన ఐదేళ్లలో ఢిల్లీలోని ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు పెరగకుండా కట్టుదిట్టం చేసింది. ప్రైవేటు స్కూల్స్‌లో ప్రవేశం కోసం క్యాపిటషన్ ఫీజు, డొనేషన్స్ కూడా కూడా రద్దు చేసింది. అంతే కాదు తమ ప్రభుత్వం ఉన్నంతవరకూ ప్రైవేటు స్కూల్స్ తమ ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచడాన్ని అనుమతించేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

ఢిల్లీలో AAP పార్టీ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా సంస్కరించింది. ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచడాన్ని అడ్డుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో క్యాపిటషన్ ఫీజు, డొనేషన్లను నిషేధించింది. మొహల్లా క్లినిక్స్‌తో ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మందులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయానికి ఇదెంతో ఉపకరించింది  

ఢిల్లీ వార్షిక బడ్జెట్‌లో 25 శాతాన్ని విద్యకు కేటాయించడమే ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీకి దర్పణం పట్టింది. నిజానికి ఇదొక రికార్డు. దేశ చరిత్రలో ఇంతవరకూ విద్యకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం మరొకటి లేదు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు రంగంలో ఉన్న కార్పొరేట్ బడులతో పోటీ పడుతున్నాయి. ఆ వెంటనే ప్రైవేటు స్కూల్స్ మీద ఆప్ ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాల విద్యా సంచాలకుడి అనుమతి లేకుండా ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్ ఫీజు పెంచరాదని ఢిల్లీ సర్కారు ఒక సర్క్యూలర్ జారీ చేసింది. అంతే కాదు 2016 నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను తొమ్మిది శాతం వడ్డీతో విద్యార్థుల తల్లితండ్రులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విద్య రంగాన్ని వ్యాపారం చేయడాన్ని నిరోధించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని కేజ్రీవాల్ పదే పదే చెబుతూ వచ్చారు. 

See Also | ప్రేక్షకులు లేకుండానే..IPL మ్యాచ్‌లు!

ఢిల్లీలో ఉన్న మొత్తం 575  ప్రైవేటు పాఠశాలలు కలిసి ఒక యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాల మీద యాక్షన్ కమిటీ హైకోర్టులో కేసు వేసింది. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేయాలనీ కోరింది. ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ప్రైవేటు పాఠశాలల యాక్షన్ కమిటీకి అనుకూలంగా తీరు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అంతటితో ఆగలేదు.

సింగిల్ జడ్జి తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం అప్పీలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో ఢిల్లీలో ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచడాన్ని ఆప్ సర్కారు అడ్డుకొన్నట్లయింది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకూ ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచడాన్ని అనుమతించేది లేదని మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చారు. 

Read More : మలక్ పేట ట్రాఫిక్ SI బూతుపురాణం..వీడియో వైరల్