Mallikarjun Kharge: కార్మిక నాయకుడి నుంచి కాంగ్రెస్ నాయకుడి దాకా.. మల్లికార్జున ఖర్గే ప్రస్తానమిది

సాధారణ కార్మిక నాయకుడి నుంచి దేశంలో ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారు మల్లికార్జున ఖర్గే. కర్ణాటక నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు దేశంలోని ప్రధాన పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన తీరు ఆదర్శం.

Mallikarjun Kharge: కార్మిక నాయకుడి నుంచి కాంగ్రెస్ నాయకుడి దాకా.. మల్లికార్జున ఖర్గే ప్రస్తానమిది

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మల్లికార్జున ఖర్గే. 24 సంవత్సరాల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నికైన అధ్యక్షుడిగా నిలిచారు ఖర్గే. 1942, జూలై 21న కర్ణాటకలో జన్మించిన ఖర్గే ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు.

Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

ఖర్గే అసెంబ్లీకి, పార్లమెంట్‌కు కలిపి 12 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మినహా ప్రతిసారీ విజయం సాధించారు. కర్ణాటకలో వరుసగా తొమ్మిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ, కేంద్రంలోనూ కీలక పదవులు చేపట్టారు. ఆయన రాజకీయ ప్రస్థానం 1969లో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రారంభమైంది. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండటం విశేషం. అయితే, అంతకుముందే ఆయనలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. లా చదివిన ఖర్గే ఎందరో కార్మికుల తరఫున కేసులు వాదించి గెలిచారు. జూనియర్ లాయర్‌గా ఉన్నప్పుడే కార్మిక యూనియన్‌కు సంబంధించిన అనేక కేసులు గెలిచారు. దీంతో ఆయనకు కార్మిక వర్గంలో మంచి గుర్తింపు లభించింది.

Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన

తర్వాత కార్మిక నాయకుడిగా ఎన్నికయ్యారు. ఇదే ఆయన తొలిగా స్వీకరించిన పదవి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్ణాటకలో విద్యా శాఖ మంత్రిగా, గ్రామీణ పంచాయతి రాజ్ శాఖ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా.. ఇలా అనేక మంత్రిత్వ శాఖల్ని నిర్వహించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రైల్వే శాఖ, న్యాయ శాఖ బాధ్యతలు కూడా చూశారు. ఎప్పుడూ ఉన్నత విలువలతో కూడిన రాజకీయం చేసే ఖర్గేపై పెద్దగా అవినీతి ఆరోపణలు, వివాదాలు లేవు. దీంతో ఆయన అయితేనే కాంగ్రెస్ పార్టీని నడిపించగలరని కాంగ్రెస్ అధిష్టానం నమ్మింది. దీంతో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచి, గెలిచారు. బాబూ జగ్ జీవన్ రామ్ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన రెండో దళిత నేతగా నిలిచారు.