క్షీణించిన లాలూ ఆరోగ్యం…ఎన్నికల ఫలితాల ఒత్తిడే కారణమట

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2020 / 07:43 PM IST
క్షీణించిన లాలూ ఆరోగ్యం…ఎన్నికల ఫలితాల ఒత్తిడే కారణమట

Lalu Yadav not well దేశమంతా ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల వైపు చూస్తోంది. మరి కొన్నిగంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కి అనుకూలంగా ఉన్నాయి. తేజస్వీ సీఎం కావడం పక్కా అని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి.



అయితే,ఈ సమయంలో ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఎన్నికల ఫలితాల నేపధ్యంలోనే ఒత్తిడికి గురవుతున్నందున లాలూ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం డయాలసిస్ మాత్రం కొనసాగుతోందని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొద్ది గంటల వ్యవధే మిగిలున్న నేపధ్యంలో లాలూ ఆరోగ్యం క్షీణించడం ఆందోళన కల్గిస్తోంది.



కాగా,దాణా కుంభకోణం కేసులో 2017 నుంచి లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, అనారోగ్య కారణాల దృష్ట్యా లాలూ…రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా కిడ్నీ సమస్యతో లాలూ బాధపడుతున్నారని..అయితే ఇప్పటివరకూ డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు తెలిపారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేయాల్సి వస్తోందన్నారు