మహారాష్ట్రలో శాఖల కేటాయింపు…శివసేనకు హోం,ఎన్సీపీకి ఫైనాన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : December 12, 2019 / 12:54 PM IST
మహారాష్ట్రలో శాఖల కేటాయింపు…శివసేనకు హోం,ఎన్సీపీకి ఫైనాన్స్

మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. మంగళవారం ఎన్పీపీ నాయకుడు అజిత్ పవార్,కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిసి మూడుపార్టీల మధ్య పవర్ షేరింగ్ ఫైనలైజ్ పై చర్చించిన అనంతరం ఇవాళ మంత్రులకు పదవుల కేటాయింపు జరిగింది.

 శివసేన నాయకుడు ఏక్ నాధ్ షిండేకు కీలకమైన హోం శాఖను కేటాయించారు. మరో శివసేన నాయకుడు సుభాష్ దేశాయ్ కు ఇండస్ట్రీ,ఉన్నత మరియు సాంకేతిక విద్య,స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలను కేటాయించారు. ముఖ్యమైన ఆర్థికశాఖ,హౌసింగ్,ఫుడ్ సప్లయ్,లేబర్ శాఖలను ఎన్సీపీ నాయకుడు జయంత్ పాటిల్ కు కేటాయించారు. మరో ఎన్సీపీ నాయకుడు చాగన్ భుజ్బాల్ కు గ్రామీణ అభివృద్ధి,సామాజిక న్యాయం,జలవనరులు,ఎక్సైజ్ శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ కు రెవెన్యూ శాఖ దక్కింది. మరో కాంగ్రెస్ నాయకుడు నితిన్ రౌత్ కు ఓబీసీ డెవలప్ మెంట్,మహిళామరియు శిశు అభివృద్ధి శాఖ,పీడబ్యూడీ ట్రైబల్ డెవలప్ మెంట్ శాఖలను కేటాయించారు.

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం సీటు విషయంలో బీజేపీతో 30ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్,ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్-28,2019న  శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.