స్నేహితుడి ఒళ్లో వలస కార్మికుడు (అసలు కథ ఇదే)

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 10:56 AM IST
స్నేహితుడి ఒళ్లో వలస కార్మికుడు (అసలు కథ ఇదే)

 

ఉత్తరప్రదేశ్ లోని స్వగ్రామానికి వెళుతుండగా అనారోగ్యానికి గురైన వలస కార్మికుడు రోడ్డుపైనే కూర్చుండిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో ఇరుక్కుపోయిన వ్యక్తి పడిపోయాడని అతని స్నేహితుడు అడుగుతున్న సాయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దయనీయంగా మారిన వలస కార్మికుల పరిస్థితికి కామెంట్లు వరదల్లా వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే 24 ఏళ్ల స్నేహితుడిని హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఎండవేడికి తట్టుకోలేక చనిపోయాడు. మృతుని పేరు అమృత్. గుజరాత్ నుంచి ట్రక్ లో ఉత్తరప్రదేశ్ వస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు. సూరత్ లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత ట్రక్ లో వెనుక నిల్చొని ప్రయాణించేందుకు రూ.4వేలు చెల్లించాడు. 

జర్నీలో ఉండగానే జబ్బున పడ్డ అమృత్.. శివపురి సమీపంలో ట్రక్ నుంచి కిందకు దిగిపోయాడు. అతని స్నేహితుడు యాకూబ్ కూడా అతనితో పాటే ఉండిపోయాడు. ఆ ఫొటోలో యాకూబ్ ఒడిలో స్నేహితుడిని పడుకోబెట్టుకుని అటుగా వెళ్తున్న వారిని సాయం కావాలంటూ అడుగుతున్నాడు. ఎవ్వరూ స్పందించలేదు. ఓ స్థానికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది సర్క్యులేట్ అయ్యేసరికి ఆ వ్యక్తి మరణించాడు. 

అమృత్ కు హై ఫీవర్ తో పాటు వాంతులు కూడా ఉన్నాయి. శరీరంలో వేడి పెరగడం వల్ల కనిపించే లక్షణాలు ఇవి. కొవిడ్ 19టెస్టు ఫలితాలు వచ్చిన తర్వాత ఇది మామూలు జ్వరమే అని కన్ఫామ్ చేసుకున్నాం. యాకూబ్ ను ఐసోలేషన్ వార్డులో ఉంచాం. టెస్టు రిజల్ట్ ఇంకా తేలాల్సి ఉందని డాక్టర్ చెప్పుకొచ్చారు. 

ఉద్యోగాలు కోల్పోయి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నవారికి ఆహారం అందించాలని వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆకలితో ఉండి ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారో.. మామూలుగా ఎవరు వెళ్తున్నారో తెలుసుకోవడం కష్టమని చెప్పేసింది.