Milind Naik : లైంగిక ఆరోపణలు.. మంత్రి పదవి ఊడింది

లైంగిక వేధింపులు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు గోవా క్యాబినెట్ మినిస్టర్ మిలింద్ నాయక్. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు

Milind Naik : లైంగిక ఆరోపణలు.. మంత్రి పదవి ఊడింది

Milind Naik

Milind Naik : రాజకీయ నాయకులపై లైంగిన ఆరోపణలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. లైంగిక వేధింపులు రుజువు కావడంతో పదవులు కోల్పోయిన రాజకీయ నాయకులూ చాలామంది ఉన్నారు. క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులు కూడా ఈ లైంగిక వేధింపుల ఆరోపణలతో తమ పదవులను వదిలేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే తాజాగా గోవా మంత్రి మిలింద్‌ నాయక్‌.. తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రి మిలింద్‌ ఓ మహిళను లైంగికంగా వేధించాడంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు.

చదవండి : Goa : గిరిజనులతో ప్రియాంక గాంధీ డ్యాన్స్…వీడియో వైరల్

మిలింద్ ను క్యాబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ గోవా పార్టీ అధ్యక్షుడు గీరిష్ చోడంకర్ ఆరోపణలు గుప్పించారు. మంత్రిపై వస్తున్న ఆరోపణలపై పొలుసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తనపై ఆరోపణల నేపథ్యంలో.. మిలింద్ నాయక్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. దీనిపై గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నిస్పక్షపాతంగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే తాను మంత్రిపదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు మిలింద్ నాయక్.

చదవండి : Goal : లక్ష్యసాధనలో అవరోధాలను అధిగమించటం ఎలాగంటే!…