Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం ఒక మిస్టరీ.. NFIR ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు

ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అనీ ఇలాంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం ఒక మిస్టరీ.. NFIR ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు

NFIR general secretary Raghavaiah

NFIR general secretary Raghavaiah : ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ (National Federation of Indian Railwaymen) ప్రధాన కార్యదర్శి రాఘవయ్య (general secretary Raghavaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అని.. ఈ ప్రమాదానికి ఏ ఒక్కరినో బాద్యుల్ని చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. మెయిన్ లైన్ లో వెళ్ళవలసిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి వెళ్లి మొదట గూడ్స్ రైలును ఢీకొట్టిందని.. దానివల్ల పక్కనే వెళ్తున్న బెంగుళూరు హౌరా ఎక్స్ ప్రెస్ రైలుపై పడటంతో పెను ప్రమాదం సంభవించిందని తెలిపారు.

Odisha Train Accident : రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర ,రాష్ట్రాలు చెరో రూ.10లక్షలు పరిహారం ప్రకటన

అధునాతన సిగ్నల్ వ్యవస్థ భారత్ లో ఉందని….కానీ ఇటువంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు. ఆటోమేటిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో ట్రైన్ మెయిన్‌లైన్‌లో వెళ్లాలి..సిగ్నల్ జంప్ చేసి లోకో పైలెట్ ముందుకు వెళ్తే మానవ తప్పిదం అంటాం..కానీ ఇక్కడ సిగ్నల్ ప్రకారమే లోకో పైలట్ నడిపినట్టు తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు.

కానీ ప్రయాణికుల రైలు లూప్ లైన్‌లోకి మిస్టీరియస్‌గా ప్రవేశించడం వల్ల ప్రమాదం జరిగినట్టు కనిపిస్తోందని.. ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి ఎలా వెళ్ళింది అన్నదే ప్రశ్నార్థకంగా ఉందని అన్నారు. ఈ ప్రమాదం చాలా మిస్టీరియస్‌గా ఉంది. దీనిపైన లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందిని తెలిపారు.

Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీ ప్రయాణికుల వివరాలు వెల్లడించిన రైల్వే శాఖ.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 238కు చేరింది. 100మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రంగా ఉంది కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. గాయపడినవారిని చికిత్స కోసం సారో, గోపాల్ పూర్, కంఠపాడ ఆస్పత్రులకు తరలించారు. ఇంకా తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.