Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసిన నీఫియు రియో.. హాజరైన ప్రధాని మోదీ

కోహిమాలోని రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నీఫియు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు.

Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసిన నీఫియు రియో.. హాజరైన ప్రధాని మోదీ

Neiphiu Rio: నాగాలాండ్‌లో మంగళవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) ఆధ్వర్యంలో, నీఫియు రియో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. కోహిమాలోని రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నీఫియు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Plane Crash In US: అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ మృతి, ఆమె కూతురుకు గాయాలు

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. నీఫియూ రియో ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఇది వరుసగా ఐదోసారి. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నీఫియు.. గత శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ లా గనేశన్‌ను కోరారు. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్‌లో ఎన్డీపీపీ, బీజేపీ కూటమి కలిసి పని చేశాయి. ఈ కూటమి మొత్తంగా 37 సీట్లు దక్కించుకుంది. ఇతర పార్టీలు కూడా నీఫియుకు, ఆయన ప్రభుత్వానికి మద్దతిచ్చాయి.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్టు

అన్ని పార్టీలు నీఫియుకు మద్దతు తెలుపుతూ లేఖలు అందించాయి. దీంతో ప్రతిపక్షమే లేకుండా నీఫియు పాలన సాగనుంది. గతంలో కూడా రెండుసార్లు ప్రతిపక్షమే లేని ప్రభుత్వంగా అక్కడ పాలన సాగింది. ఈ సారి ఎన్నికల్లో తొలిసారిగా ఒక మహిళ నాగాలాండ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఇప్పటివరకు 13సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా, ఒక్క మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఈసారి హెఖాని జకాలు అనే మహిళ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుంది.