Covid : ఒకే కాలేజీలో 56మంది విద్యార్థులకు కరోనా.. ప్రిన్సిపాల్‌పై కేసు

ఒడిశాలోని దెంకనల్ లో ఉన్న ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. ఏకంగా 56మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాగా, పాజిటివ్ గా వచ్చిన వారందరినీ క్యాంపస్ లో క్వారంటైన్

Covid : ఒకే కాలేజీలో 56మంది విద్యార్థులకు కరోనా.. ప్రిన్సిపాల్‌పై కేసు

Covid

Covid : ఒడిశాలోని దెంకనల్ లో ఉన్న ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. ఏకంగా 56మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాగా, పాజిటివ్ గా వచ్చిన వారందరినీ క్యాంపస్ లో క్వారంటైన్ లో ఉంచకుండా.. ఎవరి ఇంటికి వాళ్లను పంపేశారు కాలేజీ ప్రిన్సిపాల్. దీన్ని జిల్లా అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్, ఓనర్ పై కేసు నమోదైంది. 270 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 56మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ ఉదంతంపై స్పందించిన దెంకనల్ కమిషనర్.. బాధ్యతారాహిత్యమైన చర్య అని మండిపడ్డారు.

Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం… ఆరోగ్యానికి మంచిదేనా?

దెంకనల్ మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమంత దీనిపై స్పందించారు. “విద్యార్థులను ఇంటికి వెళ్లడానికి అనుమతించారని తెలిసింది. ఇది చాలా బాధ్యతారాహిత్యం. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాము. కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ ఇద్దరిపై కేసు నమోదు చేయబడింది. విద్యార్థులను ఇప్పుడు గుర్తించడం జరుగుతోంది. వారి కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులందరినీ కూడా గుర్తించి పరీక్షలు చేయిస్తాం” అని ఆఫీసర్ చెప్పారు.

”గతవారం నలుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత బుధవారం రోజున 33మందికి నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత గురువారం రోజున మరో 19మందికి పాజిటివ్ అని తెలిసింది. టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆ విద్యార్థులను క్యాంపస్ లోనే మెడికల్ సూపర్ విజన్ లో ఐసోలేట్ చేయాలని అధికారులు సూచించారు. అయితే అందుకు భిన్నంగా కాలేజీ యాజమాన్యం వారిని ఇళ్లకు పంపేసింది” అని చీఫ్ డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ మిశ్రా చెప్పారు. అధికారుల ఆదేశాలతో ఆ కాలేజీ ఆవరణను మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

Booster Dose : దేశంలో 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్!

“మేము క్యాంపస్‌ను సందర్శించినప్పుడు, కాలేజీ అధికారులు కోవిడ్-19 ప్రోటోకాల్‌ ను పాటించడం లేదని గుర్తించాము. జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వకుండానే విద్యార్థులను క్యాంపస్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు అనుమతించినందుకు కళాశాల అధికారులకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చాము. కాలేజీ ప్రాంగణాన్ని డిసెంబర్ 10 వరకు మైక్రో-కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాము. అలాగే క్యాంపస్‌లోని మూడు హాస్టళ్లకు సీల్ వేశాము” అని దెంకనల్ మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమంత అన్నారు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

వారం రోజుల వ్యవధిలో రెండు విద్యాసంస్థల్లో(సుందర్ ఘర్, సంబల్ పూర్ ) కరోనా కేసులు వెలుగుచూశాయి. సుందర్ ఘర్ లోని సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్ లో 42మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. సంబల్ పూర్ లోని విమ్ సర్ కి చెందిన 31మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారు. ఆ విద్యాసంస్థల్లోని రెసిడెన్షియల్ బ్లాక్స్ ను అధికారులు మైక్రో కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు.