Sabarimala: శబరిమలకు ఒక్క రోజే లక్ష మంది భక్తులు.. పెరిగిన రద్దీపై సీఎం విజయన్ సమీక్ష

కేరళలోని ప్రముఖ శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే 1,07,260 మంది భక్తులు దర్శనం చేసుకోబోతున్నారు. భక్తుల రద్దీపై సీఎం సమీక్ష జరుపుతున్నారు.

Sabarimala: శబరిమలకు ఒక్క రోజే లక్ష మంది భక్తులు.. పెరిగిన రద్దీపై సీఎం విజయన్ సమీక్ష

Sabarimala: కేరళలోని శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే దర్శనానికి 1,07,260 మంది భక్తులు బుకింగ్స్ చేసుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో వస్తుండంతో ఇక్కడి పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.

Janasena ‘Varahi’ Registration : పవన్ కల్యాణ్ ‘వారాహి‘ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 : డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ చర్యలు వంటి అంశాలపై సీఎం చర్చిస్తారు. సోమవారం దర్శనానికి బుకింగ్స్ చేసుకున్న భక్తుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఒక్క రోజే 1,07,260 మంది దర్శనం చేసుకోబోతున్నారు. ఇదో రికార్డు. ఒకే రోజు లక్ష మంది దర్శనం చేసుకోనుండటం ఈ సీజన్‌లో ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రత పెంచారు. పంపా నుంచి సన్నిధానం వరకు భక్తుల రద్దీని నియంత్రించి, దర్శనం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు కూడా స్పందించింది. ఆదివారం ప్రత్యేకంగా దీనిపై విచారణ జరిపింది. భక్తు రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులు, కలెక్టర్‌ను ఆదేశించింది.

Janasena ‘Varahi’ : పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌కు అనుమతి..

అలాగే భక్తుల దర్శనానికి మరో అరగంట లేదా గంట అదనంగా అనమతివ్వాలని దేవస్థాన నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ‘ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్’కు సూచించింది. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా గాయపడుతున్నారని, వారి విషయంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక భక్తుల భద్రత, ఏర్పాట్లపై ఈ రోజు జరిగే సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు.