Asaduddin Owaisi: ప్రధాని మోదీకి ఓవైసీ సూచన.. ఆ విషయంపై మీ స్నేహితుడు అబ్బాస్‌ను అడగండి.. |PM, Please Ask Your Friend Abbas, If He Exists…

Asaduddin Owaisi: ప్రధాని మోదీకి ఓవైసీ సూచన.. ఆ విషయంపై మీ స్నేహితుడు అబ్బాస్‌ను అడగండి..

ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ సూచన చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అని మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్‌ను అడగాలని సూచించారు.

Asaduddin Owaisi: ప్రధాని మోదీకి ఓవైసీ సూచన.. ఆ విషయంపై మీ స్నేహితుడు అబ్బాస్‌ను అడగండి..

Asaduddin Owaisi: ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ సూచన చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అని మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్‌ను అడగాలని సూచించారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. దీంతో నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా ఆమె వ్యాఖ్యలపై వివాదం సద్దుమణగలేదు. తాజాగా తన తల్లి హీరాబెన్ మోడీ 99వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను కలిసి ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ప్రధాని మోదీ.. అబ్బాస్‌తో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

PM Modi: తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడ్ని గుర్తు చేసుకున్న మోదీ

మా నాన్నకు దగ్గరలోని ఒక ఊరిలో స్నేహితుడు ఉండేవాడు. అకాల మరణం తర్వాత తన స్నేహితుడి కొడుకు అబ్బాస్‌ని మా ఇంటికి తీసుకొచ్చాడు. మా దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడు. అమ్మ అబ్బాస్‌ పట్ల ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. మా అందరి తోబుట్టువుల కోసం ఆమె చేసినట్లే.. ప్రతి సంవత్సరం ఈద్ రోజున.. ఆమె అతనికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసేది అని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ చెప్పిన విషయంపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా బదులిస్తూ.. “ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని తన స్నేహితుడిని గుర్తు చేసుకున్నారు. మీకు ఈ స్నేహితుడు ఉన్నారని మాకు తెలియదు. మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి మిస్టర్ అబ్బాస్ అక్కడ ఉంటే ఫోన్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు అడ్రస్ ఇస్తే నేను అబ్బాస్‌ వద్దకు వెళ్తాను. మహ్మద్ ప్రవక్త గురించి నూపుర్ శర్మ చెప్పినది అభ్యంతరకరంగా ఉందా లేదా అని నేను అతనిని అడుగుతాను. ఆమె చెత్త మాటలను అతను అంగీకరిస్తాడా..? అని అసదుద్దీన్ అన్నారు.

PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో పోస్టు చేసిన కేంద్ర మంత్రి

ఇదిలాఉంటే అబ్బాస్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. అతను తన కొడుకుతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అబ్బాస్ కు ఇద్దరు కుమారులు. అతని పెద్ద కుమారుడు గుజరాత్ లోని కసింపి గ్రామంలో, చిన్న కుమారుడు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. అయితే అబ్బాస్ గుజరాత్ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సప్లయిస్ డిపార్ట్ మెంట్ లోపనిచేసేవాడు. ఇప్పుడు రిటైర్డ్ అయినట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీ అబ్బాస్ ప్రస్తావన తేవడంతో.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. అబ్బాస్ మీకు ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చారాఅంటూ ప్రశ్నిస్తున్నారు.

×