Union Minister Nitin Gadkari : నితిన్ గడ్కరీ కార్యాలయంకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు .. జైల్లో అధికారుల కళ్లుగప్పి ఫోన్ చేశాడట..

కర్ణాటకలోని బెలగావిలోని జైలు నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. జైలులో సిబ్బందికి తెలియకుండా ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా గ్యాంగ్‌స్టర్, హత్య నిందితుడు జయేష్ కాంత బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Union Minister Nitin Gadkari : నితిన్ గడ్కరీ కార్యాలయంకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు .. జైల్లో అధికారుల కళ్లుగప్పి ఫోన్ చేశాడట..

Nitin Gadkari

Union Minister Nitin Gadkari : నాగ్‍‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయంకు శనివారం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేసి హత్యచేస్తామని, కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరింపులకు గురిచేసిన విషయం విధితమే. శనివారం మధ్యాహ్నం సమయంలో మూడు సార్లు ల్యాండ్‌లైన్‌కు కాల్స్ రావడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు నాగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై విచారణ జరిపారు.

Union Minister Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపుతామని హెచ్చరికలు

పోలీసుల విచారణలో భాగంగా.. కర్ణాటకలోని బెలగావిలోని జైలు నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. జైలులో సిబ్బందికి తెలియకుండా ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా గ్యాంగ్‌స్టర్, హత్య నిందితుడు జయేష్ కాంత బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై నాగ్ పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ.. బెలగావి జైలులో ఖైదీగా ఉన్న జయేష్ కాంత అనే వ్యక్తి జైలులో సిబ్బందికి తెలియకుండా లాండ్‌లైన్ ఫోన్ ద్వారా బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు.

 

విచారణకోసం నాగ్‌పూర్ పోలీసుల బృందం బెలగావికి వెళ్లింది. జైలు అధికారులు నిందితుడి నుంచి డైరీని స్వాధీనం చేసుకున్నారు. నాగర్ పూర్ పోలీసులు నిందితుడిని ప్రొడక్షన్ రిమాండ్ కోరారు. అయితే, జయేష్ కాంత.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ లో సభ్యుడిగా చెప్పుకుంటూ ఫోన్ కాల్ లో బెదిరించాడని, రూ. వందకోట్లు డిమాండ్ చేశాడని కేంద్ర మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో మహారాష్ట్రలోని గడ్కరీ నివాసం, కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.