World First Recycled Sunglasses : ‘చిప్స్‌ ప్యాకెట్లతో కళ్లద్దాలు’ తయారు చేసిన పూనె కంపెనీ .. ప్రపంచంలోనే మొదటి రీసైకిల్డ్‌ సన్‌గ్లాస్‌

‘చిప్స్‌ ప్యాకెట్లతో కళ్లద్దాలు’ తయారు చేసింది పూనెకు చెందిన ఓ స్లార్టప్ కంపెనీ ..ఇవి ప్రపంచంలోనే మొదటి రీసైకిల్డ్‌ సన్‌గ్లాస్‌ అని వెల్లడించింది ‘ఆశయ విత్‌ఔట్‌’ కంపెనీ.

World First Recycled Sunglasses : ‘చిప్స్‌ ప్యాకెట్లతో కళ్లద్దాలు’ తయారు చేసిన పూనె కంపెనీ .. ప్రపంచంలోనే మొదటి రీసైకిల్డ్‌ సన్‌గ్లాస్‌

World First Recycled Sunglasses : ప్లాస్టిక్ వాడకం పెరుగుతోంది. అలాగే గుడ్డిలో మెల్ల లాగా కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ జరుగుతోంది. కానీ ప్లాస్టిక్ వాడకంతో పోల్చితే రీసైక్లింగ్ అనేది చాలా తక్కువ శాతమే అయినా ఇది చాలా అవసరంగా మారింది. ఇటీవల పార్లమెంట్ కు ప్రధాని మోడీ నీలం రంగు జాకెట్‌ ధరించిన సమావేశాలకు హాజరయ్యారు. మోడీ ఎన్నో జాకెట్లు ధరిస్తుంటారు. కానీ ప్రత్యేకించి ఈ నీలంరంగు జాకెట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఈ మోడీ ధరించిన ఈ నీలం రంగు జాకెట్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి తయారు చేసినదే కావటం. ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది చాలా అవసరంగా మారుతోంది. ఇటువంటి సందేశం కోసం ప్రధాని ఇటువంటి జాకెట్ ధరించి సమావేశాలకు హాజరయ్యారు.

PM Modi Blue Jacket: ప్రధాని మోదీ ధరించిన బ్లూ జాకెట్‭ వెనుక గ్రీన్ సందేశం

ఇదిలా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మరింత ఆసక్తికరమైనది. అదే ప్రపంచంలోనే మొదటి సారిగా రీసైకిల్డ్‌ సన్‌గ్లాస్‌ తయారయ్యాయి. పూనెకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ‘చిప్స్ పాకెట్స్’తో ఈ సన్ గ్లాసెస్ ను తయారు చేసింది..! చిప్స్‌ ప్యాకెట్లను రీసైకిల్‌ చేసి దాన్నుంచి సేకరించిన ప్లాస్టిక్‌తో సన్‌గ్లాసెస్‌ను తయారుచేసింది. ప్రపంచంలోనే మొదటి రీసైకిల్డ్‌ సన్‌గ్లాస్‌ ఇదేనని చెబుతోంది పూనెకు చెందిన ‘ఆశయ విత్‌ఔట్‌’ (Ashaya Without) స్టార్టప్‌ కంపెనీ..!! ఈ ట్రెండీ రీసైకిల్ సన్ గ్లాసెస్‌ను విడుదల చేస్తున్నట్లుగా కంపెనీ వ్యవస్థాపకుడు అనీష్ మల్పానీ గురువారం (ఫిబ్రవరి 16,2023)ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఆర్‌ సన్‌గ్లాసెస్ (rSunglasses) పేరుతో తీసుకొచ్చిన ఈ కళ్లజోడును తీసుకొచ్చారు. మల్టీలేయర్డ్‌ ప్లాస్టిక్స్‌ (Multi-Layered Plastics) నుంచి వీటిని తయారు చేసిన విధానానికి సంబంధించిన వీడియోను కంపెనీ వ్యవస్థాపకుడు అనీష్‌ మల్పానీ (Anish Malpani) ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఈ సందర్భంగా అనీశ్ దీని గురించి వివరిస్తూ..‘‘చిప్స్ ప్యాకెట్లతో భారత్‌లో తయారుచేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి సన్‌గ్లాసెస్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. ఇందులో చిప్స్ ప్యాకెట్లను సేకరించి వాటి రీసైకిల్ చేసి.. వాటి నుంచి సేకరించిన ప్లాస్టిక్‌తో కళ్లజోడు తయారు చేశారు. ఈ కళ్లజోడు ధర రూ.1,099. కంపెనీ వెబ్‌సైట్‌ లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఈ కళ్లజోడు తయారు చేయటానికి రీసైక్లింగ్ లో కేవలం చిప్స్ ప్యాకెట్స్ మాత్రమే కాదు. చాక్లెట్స్ రేపర్స్, పాల ప్యాకెట్స్ వంటి ప్లాస్టిక్ తో తయారైన ప్యాకెట్స్ తో తయారు చేశారు.2021లో అనీష్ మల్పానీ ఈ కంపెనీని ప్రారంభించారు.

కాగా..ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు కడుతున్నారు.రోడ్లు వేస్తున్నారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెస్సులు కూడా తయారు చేయటమే కాదు వాటిని ధరించి ర్యాంప్ వాక్ చేశారు నైజీరియా అమ్మాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన డ్రెస్సులు వేసుకుని ఫ్యాషన్ షో నిర్వహించారు నైజీరియాలో అమ్మాయిలు. ఈ వినూత్న ఆలోచనల గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండీ..ప్లాస్టిక్ వ్యర్ధాలతో తయారైన ర్యాంప్ వాక్ చేసిన అమ్మాయిల వినూత్న ఆలోచనల గురించి తెలుసుకోండీ..

Neigeria girls “Trashion Show” : ప్లాస్టిక్ వ్యర్థాల డ్రెస్సులు వేసుకుని..స్టేజ్ పై ర్యాంప్ వాక్ తో అమ్మాయిల అద్భుత సందేశం

మంగళూరుకు చెందిన ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్ ఇండియా ఫౌండేషన్ సరికొత్త ఆలోచనతో ఈ ప్లాస్టిక్ ఇంటికి రూపునిచ్చింది. సుమారు 1,500 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను రిసైకిలింగ్ చేసి ఇల్లు నిర్మించారు. ఇలా వినూత్న ఆలోచనలతో ప్లాస్టిక్ లకు సరికొత్త రూపునిస్తున్నారు కొంతమంది..వ్యర్ధాలతో కూడా ఇంత అందమైన కుటీరం తయారు చేయవచ్చనే వినూత్న ఆలోచనలకు రూపంగా నిలిచిన ఈ క్యూట్ కుటీరాన్ని చూడాలంటే ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండీ..

కొలుదీరిన కుటీరం : ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇల్లు భలే ఉందిగా..

అలాగే యూపీలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిర్మించినరో్డ్డు కూడా భలే చూడముచ్చటగా ఉంది. ఆ ప్లాస్టిక్ రోడ్డు నిర్మాణం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండీ..

UP : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో 1500 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం