Rahul Gandhi: గిరిజనులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రాహుల్, సీఎం గెహ్లాట్.. వీడియో వైరల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డాన్స్ చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభా వేదికపై గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆయనతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలూ పాదం కదిపారు.

Rahul Gandhi: గిరిజనులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రాహుల్, సీఎం గెహ్లాట్.. వీడియో వైరల్

Rahul Gandhi: రాజకీయాల్లో ఎక్కువగా గంభీరంగా కనిపించే నాయకుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరు. అయితే, ఇటీవల రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ స్థానికులతో మమేకమవుతూ సరదాగా ఉంటున్నారు. తాజాగా రాహుల్ గాంధీ స్టేజిపై గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు.

Gujarat Election: నేడు గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్.. 93 స్థానాలకు ఎన్నిక

రాహుల్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జలవర్ ప్రాంతంలో సాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ రాజస్థాన్ యాత్ర ప్రారంభం కావడంతో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, సీనియర్ నేత కమల్ నాథ్ వంటి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో స్టేజిపైన కొంతమంది గిరిజన కళాకారులు నృత్యం చేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్.. అందరూ కలిసి ఒకరిచేయి ఒకరు పట్టుకుని గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు.

ఈ డాన్స్ చేసే సమయంలో రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మరోవైపు కొంతకాలంగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, రాహుల్ యాత్ర కోసం ఇద్దరూ తమ విబేధాల్ని పక్కనపెట్టి పని చేశారు.