Railway Police : ప్రాణాలకు తెగించి గర్భిణీని కాపాడిన కానిస్టేబుల్

కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నం చేసిన నిండు గర్భిణీ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. పక్కనే ఉన్న రైల్వే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు.

Railway Police : ప్రాణాలకు తెగించి గర్భిణీని కాపాడిన కానిస్టేబుల్

Railway Police

Railway Police  : కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నం చేసిన నిండు గర్భిణీ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. పక్కనే ఉన్న రైల్వే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు. ఈ ఘటన ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ లో జరిగింది. క‌దులుతున్న రైల్లో నుంచి నిండు గ‌ర్భిణి కింద‌కు దిగేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. అక్క‌డే ఉన్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు.

చదవండి : Railway Notification : రైల్వేలో అప్రెంటిస్ భర్తీ నోటిఫికేషన్

త‌క్ష‌ణ‌మే ఆమె చేయి ప‌ట్టుకుని ప్లాట్‌ఫాంపైకి లాగాడు. ఆ సమయంలో కానిస్టేబుల్ అక్కడ లేకపోతే ఆ గ‌ర్భిణి రైలు ప‌ట్టాల‌కు, ప్లాట్‌ఫాం మ‌ధ్య‌లో ప‌డిపోయి ప్రాణాలు కోల్పోయే అవ‌కాశం ఉండేది. ఇక గ‌ర్భిణి వెంట ఉన్న ఓ వ్య‌క్తి కూడా ఆ రైల్లో నుంచి కింద‌కు దూకాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు.

చదవండి : SC Railway : పండగ బాదుడు.. పెరిగిన రైలు చార్జీలు