రాహుల్ గాంధీ కూడా ఔరంగజేబులానే..

రాహుల్ గాంధీ కూడా ఔరంగజేబులానే..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఔరంగజేబుతో పోల్చాడు రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ణాన్ దేవ్ అహుజా. మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఔరంగజేబులానే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ సామ్రాజ్యానికి  ముగింపు దగ్గరపడిందని అహుజా అన్నారు. గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో అహుజా వార్తల్లో నిలిచారు. ఆవుల స్మగ్లర్లు ఉగ్రవాదులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రామ్ ఘర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అహుజా తెలిపారు. బీఎస్పీ అభ్యర్థి మరణంతో రామ్ ఘర్ లో జనవరి 28న ఉప ఎన్నిక జరుగనుంది. గతంలో అహుజా రామ్ ఘర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో అహుజాకి బీజేపీ నామయకత్వం టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన స్వత్రంత్ర్య  అభ్యర్థిగా నామినేషన్ వేసి ఆ తరువాత నామినేషన్ ఉపసంహరించుకొన్నారు.