Updated On - 2:39 pm, Wed, 3 March 21
ramesh jarkiholi resign for minister post: కర్నాటక నీటి వనరుల మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల వీడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో రమేష్ జర్కిహోళి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి రమేష్ సెక్స్ స్కాండల్ లో అడ్డంగా దొరికిపోయారు. వీడియోలు వైరల్ కావడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. దీంతో రమేష్ మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
ఉద్యోగం పేరుతో ఓ మహిళను లోబరుచుకున్న మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఆరోపించిన మహిళ.. ఆ ఏకాంత దృశ్యాల వీడియోను సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించారు.
ఆయన ఆ వీడియో సీడీని కొన్ని టీవీ చానళ్లకు పంపించారు. మహిళను మోసగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌ను దినేశ్ కోరారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వీడియోపై స్పందించిన మంత్రి.. ఆ సీడీలో ఉన్నది తాను కాదని, తన ఫొటోలను ఉపయోగించి ఎవరో ఈ సీడీని రూపొందించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. కేసును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంతలోనే ఆయన పదవికి రాజీనామా చేశారు.
YouTube channel : కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్
Nagarjuna Sagar: జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత.. పోలీసులు లేకుంటే!
కరోనా కారణంగా ఆరోగ్య మంత్రి రాజీనామా
Ration Cards, Pensions : త్వరలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు
Narendra Modi: నందిగ్రామ్‌లో కూడా మమత గెలవదు – మోడీ
Prashant Kishor: జనం మెచ్చిన నేత మోడీ.. ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు