Reliance Foundation: రిలయన్స్ పెద్ద మనసు.. కరోనాతో చనిపోతే రూ.10లక్షలు.. ఐదేళ్ల జీతం!

కరోనా సంక్షోభం సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) తన ఉద్యోగుల కోసం పెద్ద మనసు చేసుకుని పెద్ద ప్రకటన చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తూనే ఉంటుందని ప్రకటించింది.

Reliance Foundation: రిలయన్స్ పెద్ద మనసు.. కరోనాతో చనిపోతే రూ.10లక్షలు.. ఐదేళ్ల జీతం!

Reliance Foundation

RIL financial support: కరోనా సంక్షోభం సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) తన ఉద్యోగుల కోసం పెద్ద మనసు చేసుకుని పెద్ద ప్రకటన చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తూనే ఉంటుందని ప్రకటించింది. దీనితో పాటు బాధితుల కుటుంబానికి రూ.10 లక్షల వరకు వన్‌టైమ్ ఆర్థిక సహాయం కూడా సంస్థ అందిస్తుంది.

కోవిడ్ సంక్షోభ సమయంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తన ఉద్యోగుల కోసం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చును కూడా రిలయన్స్ భరిస్తుంది. కరోనాతో మరణించే ఉద్యోగుల పిల్లల కోసం భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100% ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి మరియు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు పూర్తి డబ్బులను RIL అందిస్తుంది.

పిల్లల గ్రాడ్యుయేట్ వరకు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మరియు పిల్లలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రిలో చేరడానికి 100శాతం ప్రీమియంను రిలయన్స్ భరిస్తుంది. ఇది కాకుండా, కరోనా సోకిన ఉద్యోగులు లేదా వారి కుటుంబంలో ఎవరికైనా కరోనా ఉంటే.. వారు శారీరకంగా మరియు మానసికంగా కోలుకునేవరకు కోవిడ్ -19 సెలవు ఇస్తుంది.

ఇప్పటికే రిలయన్స్ గ్రూప్‌తో పాటు దాని సబ్సిడరీ సంస్థల్లో శాశ్వత, తాత్కాలిక 6 లక్షల మంది ఉద్యోగులతో పాటు వారి భార్యాపిల్లలు, తల్లిదండ్రులకు కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందించనన్నట్లు తెలిపింది రిలయన్స్.