Petrol Rates : వాహనాలు వద్దంటున్నారు.. కాళ్లకు పని చెబుతున్నారు

దేశంలో చమురు వాడకం ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్‌ విక్రయాలు దాదాపు 10 శాతం తగ్గగా.. డీజిల్‌ వినియోగం 15.6 శాతం మేర...

Petrol Rates : వాహనాలు వద్దంటున్నారు.. కాళ్లకు పని చెబుతున్నారు

Petrol

Rising Petrol Prices : దేశంలో పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు 120 రూపాయలకు చేరువైంది. బైక్‌ తీయాలంటేనే జనం జంకుతున్నారు. కారు తీయాలంటేనే కొందరు భయపడుతున్నారు. ఇంటిపక్కనే షాపు ఉన్నా.. పాల ప్యాకెట్‌ కోసం బండిపైనే వెళ్లేవారు ఇంతకుముందు. మాంసం దుకాణానికి వెళ్లాలన్నా.. మార్కెట్‌కు వెళ్లి కూరగాయాలు తేవాలన్నా కొందరు కారు, బైక్ లను ఉపయోగించే వారు. చిన్న పనైనా.. పెద్ద పనైనా గతంలో బండి లేనిదే బయటకురాని వారు పెట్రోల్‌ రేట్ల పెరుగుదల తర్వాత పునలోచనలో పడ్డారు. కారు తీయనిదే కాలు కదపలేని వారు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. సర్దుకుపోయే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. బైక్‌లు, కార్లు పక్కనపెట్టి కాళ్లకు పని చెబుతున్నారు. దీంతో పెట్రోల్‌ వినియోగం తగ్గుతోంది.

Read More : petrol price today : కొన్ని ప్రాంతాల్లో మినహా.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశంలో చమురు వాడకం ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్‌ విక్రయాలు దాదాపు 10 శాతం తగ్గగా.. డీజిల్‌ వినియోగం 15.6 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అటు వంటకు ఉపయోగించే ఎల్పీజీ వినియోగం సైతం గత నెలతో పోలిస్తే 1.7 శాతం మేర తగ్గగా.. జెట్‌ ఫ్యూయల్‌ వినియోగం సైతం 20.5 శాతం మేర తగ్గడం గమనార్హం. ఎప్పుడూ లేని స్థాయిలో ధరలు పెరగడంతో పాటు.. కొంతమంది ముందస్తుగా స్టాక్‌ పెట్టుకోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలో 137 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్‌ ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. మార్చి 22న ఒక్కసారిగా వాటి ధరలను పెంచేశాయి. దీంతో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 మధ్య ఎన్నడూ లేని స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధర 10 రూపాయల మేర పెరిగింది. మార్చి 22న వంట గ్యాస్‌ ధర సైతం 50 రూపాయలు పెరిగింది.

Read More : Litre Petrol for Re. 1: రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ: ఎగబడిన వాహనదారులు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుదలతో దేశీయంగానూ పెట్రో ధరలు పెరుగతాయన్న అంచనాలు ముందు నుంచీ ఉన్నాయి. ఎన్నికల కారణంగానే చమురు ధరలను పెంచలేదన్న నిజం జనానికీ అర్థమైంది. మార్చి మొదటి వారంలో అటు డీలర్లు, ఇటు సామాన్య ప్రజలు సైతం తమ ట్యాంకులను నింపేసుకున్నారు. దీంతో మార్చిలో పెట్రో వినియోగం మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. తద్వారా మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌ నెల తొలి అర్ధ భాగంలో వినియోగం తగ్గినట్లుగా మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య 1.12 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే తేదీలతో పోలిస్తే 12.1 శాతం అధికంగా కాగా.. 2019 మార్చితో పోలిస్తే 19.6 శాతం ఎక్కువ. అదే మార్చి తొలి అర్ధభాగంతో చూసినప్పుడు 9.7శాతం తగ్గడం గమనార్హం.ఇదే సమయంలో 3 మిలియన్‌ టన్నుల మేర డీజిల్‌ విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చినప్పుడు ఇది 7.4 శాతం అధికం కాగా.. 2019 మార్చితో పోలిస్తే 15.6 శాతం ఎక్కువ. మార్చితో పోల్చినప్పుడు మాత్రం 15.6 శాతం తగ్గింది.