Corona Vaccine : ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 కరోనా టీకా బంద్

కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.

Corona Vaccine : ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 కరోనా టీకా బంద్

Rs 250 Corona Vaccine Ban In Private Hospitals

Rs 250 corona vaccine ban : కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆ రోజు నుంచి వ్యాక్సిన్ తయారీ దారులు టీకా ధరలను ప్రకటించాలని, దాని ప్రకారమే 50 శాతం నిల్వలను ప్రైవేట్ అస్పత్రులు, పారిశ్రామిక ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించాలని కేంద్ర ఆదేశించింది. మిగిలినవి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.

దీనిపై బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ ఆ రోజు నుంచి టీకాల సేకరణ విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నందున ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని చెప్పారు.

ఇకముందు ప్రైవేట్ ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లు సరఫరా కావు. ఇప్పటివరకు రూ.250కి వేస్తూ వచ్చినా టీకాలు ఇకపై ఇచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం నడిచే కేంద్రాల్లోనే ఉచితంగానే వ్యాక్సిన్ లభిస్తుంది. ఇక్కడ 45 ఏళ్లుపైబడిన వారు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కే టీకాలు వేస్తారు. వ్యాక్సిన్ లు బహిరంగ మార్కెట్ లో మందుల షాపుల్లో దొరకవు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ తీసుకున్న సెంటర్లతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే సెంటర్లన్నింటీలోనూ కొవిన్ పోర్టల్ ద్వారా లబ్ధిదారుల పేర్లు తప్పని సరిగా నమోదు చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికీ ఇకముందు కూడా డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లభిస్తుంది.

వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ కానీ, దాని అనుబంధ సంస్థ కానీ, లేదంటే వారి అధీకృత ప్రతినిధి కానీ రెడీ టు యూజ్ వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆ వ్యాక్సిన్ ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకుగానీ, ప్రైవేట్ ఆస్పత్రులకుగానీ విక్రయించుకోవచ్చన్నారు.

కేంద్రం ఇంతకముందులాగానే రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయిస్తుంది. అయితే మూడు కొలమానాల ఆధారంగా ఒకేసారి 15 రోజులకు సరిపడా డోసులను ప్రకటిస్తుంది. వారంలో సగటున ఎన్ని డోసులు అందించింది? యాక్టివ్ కేసుల సంఖ్య ఎంత? వృథా ఎంత అని లెక్కించి కేటాయింపులు చేస్తారు.
వృథాకు మైనస్ మార్కులు ఉంటాయి.

ప్రాధానత్య వర్గాలకు రెండో డోస్ నిర్ణీత సమయంలో ఇవ్వాలి. దేశంలో ప్రస్తుతం 7,500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండగా అందులో 6,600 మెట్రిక్ టన్నులు రాష్ట్రాలకు కేటాయించారు.