SBI : కస్టమర్లకు అలర్ట్.. ఈ సేవలు పనిచేయవు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. పలు సేవలకు అంతరాయం కలగనుందని తెలిపింది. సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు ఆన్

SBI : కస్టమర్లకు అలర్ట్.. ఈ సేవలు పనిచేయవు

Sbi

SBI : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. పలు సేవలకు అంతరాయం కలగనుందని తెలిపింది. సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 15 న 00.00 గంటల నుంచి 02.00 గంటల మధ్య ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు SBI ట్వీట్ చేసింది. ఈ కాలంలో ఎస్బీఐ ఆన్ లైన్ అందుబాటులో ఉండదని తెలిపింది.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్‌ను ఎస్బీఐ అప్‌డేట్‌ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండు గంటలపాటు బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌/యోనో/యోనో లైట్‌ సేవలు ఈ రెండు గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలంది. మరి ఈ సమయాల్లో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసేవారుంటే ముందుగానే జాగ్రత్త పడండి.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

ఇంతకుముందు సెప్టెంబర్‌ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్‌ సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. సెప్టెంబర్‌ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1 గం.30ని. వరకు డిజిటల్‌ సర్వీసులు పని చేయవని తెలిపింది. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ సర్వీసులేవీ పని చేయవంది.

సాధారణంగా తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో బ్యాంకులు సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు అప్పుడప్పుడు బ్యాంకింగ్ సంస్థలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇలాంటి మెయింటెనెన్స్‌ యాక్టివిటీలు చేసే క్రమంలో సేవల్లో అంతరాయం ఏర్పడుతుంటుంది.