Tejashwi Yadav: రాత్రిపూట ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన తేజస్వి యాదవ్.. నిద్ర పోయేందుకు రెడీ అవుతూ కనిపించిన సూపరిండెంట్

ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన బిహార్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి తేజస్వి యాదవ్ షాకయ్యారు. ఆస్పత్రి పరిసరాలు అధ్వానంగా కనిపించాయి. ఇక సూపరిండెంట్ అయితే, పేషెంట్లను వదిలేసి నిద్రపోయేందుకు రెడీ అవుతూ కనిపించాడు.

Tejashwi Yadav: రాత్రిపూట ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన తేజస్వి యాదవ్.. నిద్ర పోయేందుకు రెడీ అవుతూ కనిపించిన సూపరిండెంట్

Tejashwi Yadav: బిహార్ రాజధాని పాట్నాలో ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన తేజస్వి యాదవ్ అక్కడి పరిస్థితులు చూసి షాక్ అయ్యారు. ఆయన వెళ్లే సమయానికి నిద్ర పోయేందుకు రెడీ అవుతున్నాడు ఆస్పత్రి సూపరిండెంట్. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు తేజస్వి యాదవ్.

iPhones Without Charger: యాపిల్ సంస్థకు బ్రెజిల్ షాక్.. చార్జర్లు లేకుండా ఫోన్లు అమ్ముతున్నందుకు ఫైన్.. అమ్మకాలపై నిషేధం

బిహార్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి అయిన తేజస్వి యాదవ్ రాష్ట్రంలోని సీనియర్ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉన్నాయో తనిఖీ చేయాలనుకున్నారు. పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్లాడు. అయితే, అక్కడి దృశ్యాలు చూసి షాకయ్యాడు. ఆస్పత్రిలోని సూపరిండెంట్ ఆఫీస్‌కు వెళ్లేసరికి అక్కడ ఆయన నిద్రకు రెడీ అవుతూ కనిపించాడు. ఆయన హాయిగా నిద్రపోయేందుకు బెడ్డు, మస్కిటో నెట్ సిద్ధం చేసుకున్నాడు. కాస్సేపైతే నిద్రపోయేవాడే. పేషెంట్లను వదిలేసి నిర్లక్ష్యంగా నిద్రపోతుండటంపై తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆస్పత్రిలోని పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు.

Dog Bit A Child: చిన్నారిని కుక్క కరిచినా పట్టించుకోని యజమాని.. రూ.5వేలు ఫైన్.. వీడియో వైరల్

మార్చురీలో ఉండాల్సిన ఒక మృతదేహం కారిడార్‌లో నిర్లక్ష్యంగా పడి ఉంది. ఆస్పత్రి పరిసరాలు చెత్తతో నిండిపోయి అధ్వానంగా ఉన్నాయి. రాత్రిపూట సీనియర్ డాక్టర్లు, పూర్తిస్థాయి సిబ్బంది కూడా ఉండటం లేదని గుర్తించాడు. అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో లేవు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. సిబ్బందికి సంబంధించి అటెండెన్స్ కూడా లేదు. దీంతో ఆస్పత్రిని నిర్వహిస్తున్న సూపరిండెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.