Viral Video: కోతి, బాతు పిల్లలు పుచ్చకాయ తినడం కాదు.. ఇక్కడ చూడండి కింగ్ కోబ్రా ఏం చేస్తోందో..‍!!

కింగ్ కోబ్రా.. ఈ విషసర్పం పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది.. ఇక దానిని దగ్గరి నుంచి చూస్తే ఇంకేమైనా ఉంటుందా.. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో కింగ్ కోబ్రా గ్లాసులో వాటర్ తాగుతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా.. అని అనుకుంటున్నారా.. నిజమేనండి బాబు.. ఏకంగా...

Viral Video: కోతి, బాతు పిల్లలు పుచ్చకాయ తినడం కాదు.. ఇక్కడ చూడండి కింగ్ కోబ్రా ఏం చేస్తోందో..‍!!

Black Cobra

Viral Video: కింగ్ కోబ్రా.. ఈ విషసర్పం పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది.. ఇక దానిని దగ్గరి నుంచి చూస్తే ఇంకేమైనా ఉంటుందా.. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో కింగ్ కోబ్రా గ్లాసులో వాటర్ తాగుతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా.. అని అనుకుంటున్నారా.. నిజమేనండి బాబు.. ఏకంగా ఓ వ్యక్తి చిన్న గ్లాస్ లో తెచ్చిన నీటిని చిన్న పిల్లాడు తాగినట్లు గటగటా తాగేస్తోంది. మరి ఎంత దాహంతో ఉందో..! ఇది పాత వీడియోనే అయిన ప్రస్తుతం వేసవి కాలం కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి పట్టుకున్న చిన్న గ్లాసులో నుంచి కింగ్ కోబ్రా నీళ్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూమి మీద అత్యంత విషపూరితమైన పాముల్లో కంగ్ కోబ్రా ఒకటి. ఇది ఆగ్నే యాసియాకు చెందినది. కింగ్ కోబ్రా.. నాగు పాము జాతుల్లో పొడవైనది. భారతదేశంలో చాలా అరుదుగా ఈ జాతి పాములు కనిపిస్తాయి. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్ పోస్టుకు ప్రతిస్పందనగా ncsukumar అనే నెటిజర్ ఈ వీడియోను పోస్టు చేశాడు. సుశాంత్ నందా తన ఫోస్టులో ఒక కోతి, బాతులు పుచ్చకాయ ముక్కను తింటున్నట్లుగా ఉంది.

Elephant on Tracks: రైలు పట్టాలపై ఏనుగు: చివరి క్షణంలో స్పందించిన లోకో పైలట్

ఈ వీడియోను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నాను అంటూ నందా తన ట్వీట్ లో పేర్కొన్నారు. నందా ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ncsukumar అనే నెటిజర్ నాగు పాము నీరు తాగుతున్న వీడియోను పోస్టు చేస్తూ.. కోతి, బాతు పిల్లలు పుచ్చకాయ తింటున్నాయి.. ఇక్కడ మీరు కింగ్ కోబ్రా చేతిలో పట్టుకున్న గ్లాసులో నీరు తాగడం చూస్తున్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టు పాతదే అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వేసవి కాలంలో నీటి యోక్క ప్రాధాన్యతను తెలుపుతూ ఈ వీడియోలు ఉండటంతో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.