CJI Chandrachud: తప్పుడు వార్తల ప్రవాహంలో నిజం బలిపశువుగా మారుతోంది.. సీజేఐ చంద్రచూడ్
ప్రపంచీకరణ ద్వారా వాతావరణంలో, ప్రజా జీవనంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారి ఆదాయ అసమానతల్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కొన్ని వాదాలు తరిగిపోవడం, కొన్ని పెరిగిపోవడం లాంటివి నెలకొన్నాయని అన్నారు. సోషల్ మీడియా వ్యాప్తితో ఒక విత్తనం మొలకెత్తి, వృక్షంగా మారి, అడవిని సృష్టిస్తోందని, దీన్ని ఇది శాస్త్రీయ విచారణ ద్వారా అరికట్టలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

Truth has become victim in age of false news says CJI DY Chandrachud
CJI Chandrachud: తప్పుడు వార్తల ప్రవాహం విపరీతంగా పెరగడంతో నిజం బలిపశువుగా మారుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతోందని, దాన్ని అరికట్టాలని సీజేఐ సూచించారు. అమెరికన్ బార్ అసోసియేషన్ ఇండియా కాన్ఫరెన్స్-2023ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: నా కొడుకునైనా సరే జైలుకు పంపిస్తాను.. కర్ణాటక ప్రచారంలో కేజ్రీవాల్
‘‘సాంకేతికతతో ప్రపంచ మానవత్వం విస్తరించింది. అయితే అది వారి నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని విశ్వసించలేకపోవడాన్ని విస్తరించింది, అసత్య ప్రచారాన్ని సైతం విస్తరించింది. నేటి అసత్య వార్తల యుగంలో నిజం బలిపశువుగా మారింది’’ అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ‘ప్రపంచీకరణ యుగంలో చట్టం: భారతదేశం మరియు పశ్చిమాల కలయిక’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ “ప్రపంచీకరణ దాని స్వంత అసంతృప్తికి దారితీసింది. ఒకప్పుడు ఉదారవాదంగా పరిగణించబడిన ప్రజాస్వామ్యాలలో ఇప్పుడు ప్రపంచం చిన్నదైపోతోంది. ఇప్పుడున్నది ఉదారవాదమే అంటే ఆశ్చర్యపోవాలేమో. అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారమిచ్చే హెచ్చరికల్ని గుర్తించాలి’’ అని అన్నారు.
Allahabad HC: గోవధ మీద అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు