Allahabad HC: గోవధ మీద అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్‌కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017లో రాజస్థాన్ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది

Allahabad HC: గోవధ మీద అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Declare Cow As 'Protected National Animal', Allahabad HC to Centre

Allahabad HC: గోవుల్ని తరలిస్తూ గోవధ చేస్తున్నారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి మీద వేసిన క్రమినల్ కేసును రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. అంతే కాకుండా, గోవును జాతీయ జంతువుగా ప్రకటించి, దానికి రక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మహ్మద్ అబ్దుల్ ఖలిక్ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసును విచారిస్తూ జస్టిస్ షమీమ్ అహ్మద్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ శనివారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఖలిక్ సహా మరొక వ్యక్తి గోహత్యలో ప్రమేయం ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు.

Manish Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

అయితే పోలీసులు వేనిన కేసును తప్పని నిరూపించేందుకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేనందున, కేసు రద్దు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దరఖాస్తుదారుని వాదనలో శక్తి లేదని, దురుద్దేశంతో పిటిషన్ వేశారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ షమీమ్ స్పందిస్తూ ‘‘మనం లౌకిక దేశంలో ఉన్నాము. ఇక్కడ అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఆవు దైనిక జీవితంలో భాగం, దయకు మారుపేరు, చాలా మంది విశ్వసించే జంతువు. అందువల్ల ఆవుల్ని రక్షించాలి, గౌరవించాలి’’ అని అన్నారు.

Arvind Kejriwal: నా కొడుకునైనా సరే జైలుకు పంపిస్తాను.. కర్ణాటక ప్రచారంలో కేజ్రీవాల్

వేద కాలం నుంచి ఆవు గౌరవం పొందుతోందని, ఇండో-యూరోపియన్ ప్రజలు పశుపోషకులని, వారికి ఆవే ప్రధాన ఆర్థిక మూలమని జస్టిస్ షమీమ్ అన్నారు. పైగా హిందూ మతంలో ఆవును చాలా ప్రాధాన్యత ఉందని, పాలను ఉత్పత్తి చేసే ఆవులను వధించడం నిషేధించాలని అన్నారు. “ఇతిహాసాల్లో పూజారులు, గోవులకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. పూజారులు మత గ్రంధాలను పఠించవచ్చు. ఆవులు ఆచారాలలో నైవేద్యంగా నెయ్యిని ఉత్పత్తి చేస్తాయి. ఎవరైనా గోవులను చంపినా లేదా వాటిని చంపడానికి ఇతరులను అనుమతించినా అతని శరీరంపై వెంట్రుకలు ఉన్నన్ని సంవత్సరాలు నరకంలో కుళ్ళిపోయినట్లు పరిగణించబడుతుంది. అదేవిధంగా, ఎద్దును శివుని వాహనంగా చిత్రీకరించారు. ఇది మగ పశువుల పట్ల గౌరవానికి చిహ్నం” అని ధర్మాసనం అభిప్రాయపడింది.

Gambia Childerns Death: గాంబియా చిన్నారుల మరణాలకు ఇండియన్ దగ్గు సిరప్‭లే కారణం.. మరోసారి స్పష్టం చేసిన యూఎస్ రిపోర్టు

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్‌కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017లో రాజస్థాన్ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ గత ఏడాది అక్టోబర్‌లో దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.