PM Modi-Zelensky Meet : మోదీయే మా నమ్మకం .. మోదీ, జెలన్‌స్కీ సమావేశంపై ప్రపంచం దృష్టి

యుద్ధం తీవ్రత ఏంటో..ఆ నష్టమేంటో..దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికంటే బాగా తెలిసింది హీరోషిమా, నాగసాకికే . రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో..అస్తిత్వాన్నే కోల్పోయి...78 ఏళ్లగా ఆ బాధలను మోస్తున్న హీరోషిమా నుంచే శాంతిసందేశం వినిపించారు భారత ప్రధాని మోదీ. అటువంటి హిరోషిమా వేదికగా ప్రధాని మోదీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తానని జెలన్‌స్కీకి హామీ ఇవ్వటం ఇక ఈ యుద్ధానికి ముగింపు కలుగుతుందనే ఆశ కలుగుతోంది.

PM Modi-Zelensky Meet : మోదీయే మా నమ్మకం .. మోదీ, జెలన్‌స్కీ సమావేశంపై ప్రపంచం దృష్టి

PM Modi G7 Summit

PM Modi Visit In Japan : 15 నెలలుగా యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. క్షిపణిలతో దాడులు చేస్తు దేశాన్ని శ్మశానంగా మార్చేస్తున్నారు. ఈ యుద్ధం గురించి ఎవరు ఏం చెప్పినా పుతిన్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు. మరోవైపు జెలెన్ స్కీ కూడా అమెరికా, యూరప్ దేశాల సహాయంతో తన శక్తికి మించి పోరాడుతున్నారు. ఈ యుద్ధంతో లక్షలాదిమంది యుక్రెయిన్ వాసులు దేశం వదిలివెళ్లిపోయారు. పలు దేశాల్లో తలదాచుకుంటున్నారు. యూరప్ దేశాలు యుక్రెయిన్ వాసులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇంత మారణ హోమాన్ని కలిగిస్తున్న ఈ యుద్ధానికి ముగింపులేదా? ఇక మనుషులను చంపుకుంటూ ఆధిపత్యం శ్మశానాలుగా మారుతున్న పరిస్థితికి ముగింపులేదా? ఏ దేశాధినేతా రష్యాకు నచ్చచెప్పరా? ఒకవేళ చెప్పినా పుతిన్ వింటారా? అంటే వినని పరిస్థితే ఉంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ వల్ల ఈ యుద్ధానికి పుల్ స్టాప్ పడుతుందనే ఆశతో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి పలుమార్లు మోదీకి విన్నవించారు. ఇలా దాదాపు యుద్ధం ప్రారంభమై 15 నెలలు జరుగుతున్నా యుద్ధానికి ముగింపు లభించటంలేదు.

ఈక్రమంలో ప్రధాని మోదీ జపాన్ పర్యటన సందర్భంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, మోదీ ఎదురెదురయ్యారు. ఇద్దరు సమావేశమయ్యారు. దీంతో ప్రపంచం అంతా వీరి సమావేశంవైపే చూస్తోంది. మోదీ ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపటానికి యత్నిస్తారా?అనే విషయంపై ఆసక్తి నెలకొంది. వీరిద్దరి సమావేశంలో మోదీ మానవత్వానికే సవాల్‌గామారిన రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తానని జెలన్‌స్కీకి హామీ ఇచ్చారు. యుద్ధ ప్రభావం ఎంత క్రూరంగా ఉంటుందో…ఎన్నాళ్లు వెంటాడుతుందో…ఎంత వేధిస్తుందో ప్రపంచంలో అందరికన్నా బాగా తెలిసింది హీరోషిమా, నాగసాకికి. రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో..అస్తిత్వాన్నే కోల్పోయి…78 ఏళ్లగా ఆ బాధలను మోస్తున్న హీరోషిమా నుంచే శాంతిసందేశం వినిపించారు ప్రధాని మోదీ. అటువంటి హిరోషిమా వేదికగా ప్రధాని మోదీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తానని జెలన్‌స్కీకి హామీ ఇవ్వటం ఇక ఈ యుద్ధానికి ముగింపు కలుగుతుందనే ఆశ కలుగుతోంది.

Japan: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి భేటీ.. ఎందుకంటే?

శాంతియుత, ప్రజాస్వామ్యదేశం అనగానే ప్రపంచంలో అందరికీ గుర్తువచ్చేది భారత్. అణుదాడులతో ప్రపంచంలో పెను విధ్వంసం జరిగిన సమయంలోనే…భారత్ అహింస, శాంతి అనే ఆయుధాలతో పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. తుపాకులు, బాంబులు, కత్తులతో పనిలేకుండా…నోటిమాటతో..శాంతియుత పోరాటంతో స్వతంత్రదేశంగా అవతరించి ప్రపంచానికి ఓ సందేశం అందించింది. మన జాతిపిత మహాత్మాగాంధీ అంతర్జాతీయ నాయకుడయ్యారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పాకిస్థాన్‌, చైనాతో యుద్ధాలు జరిగినప్పటికీ..ప్రధానంగా మనది శాంతికాముక దేశం. మిగిలిన దేశాల్లో కూడా మనకు అదే గుర్తింపు ఉంది. భారత్‌ శాంతినే కోరుకుంటుంది. శాంతియుతంగానే జీవిస్తుంది. యుద్ధాలు జరగకుండా ఉండేందుకు, జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు చేయదగిన అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే…రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ ప్రయత్నాలు ప్రారంభించారు. వీలయినంత త్వరగా యుద్ధ పరిష్కారాన్ని కనుక్కోవడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

రష్యా, యుక్రెయిన్ యుద్ధం 15 నెలలుగా సాగుతోంది. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినప్పుడు…యుద్ధం ఇంత సుదీర్ఘకాలం సాగుతుందని ఎవరూ ఊహించలేదు. ఒక్కరోజు యుద్ధం జరిగినా అది సృష్టించే పెనువిధ్వంసం మాటలకందదు. అలాంటి యుద్ధం 15 నెలలుగా నిరంతరాయంగా సాగుతోంది. యుక్రెయిన్ నగరాలు బూడిదకుప్పల్లా మారాయి. దేశం మొత్తం శిథిలావస్థలో ఉంది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియదు. ఇంకా వినాశనం కొనసాగుతూనే ఉంది. ఎక్కడ షెల్లింగ్ జరుగుతుందో..ఏ వైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో…ఏ క్షణం ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని…భయాందోళన పరిస్థితుల మధ్య యుక్రెయిన్ ప్రజలు ప్రతిరోజూ బతికి చస్తున్నారు. అనేకమంది ఇతర దేశాల్లో శరణార్థులుగా మిగిలిపోయారు. అయినా యుద్ధం ఆగడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచీ ఆయుధాలు యుక్రెయిన్‌కు తరలుతున్నాయి. ఆ నేల ఆయుధాల మార్కెట్‌గా, ప్రయోగశాలగా మారిపోయింది. అటు రష్యా పరిస్థితి ఆర్థికంగా అంతకంతకూ దిగజారుతోంది. ఉన్న వనరులన్నంటినీ యుద్ధానికే ఖర్చుపెడుతుండడంతో సగటు రష్యన్ బతుకు భారంగా మారింది. ఇంత వినాశనం కొనసాగుతున్నా..యుద్ధవిరమణ ప్రయత్నాలు జరగడం లేదు. అటు రష్యాకు, ఇటు యుక్రెయిన్‌కు సర్దిచెప్పి…పరిష్కారం కనుక్కునే నాథుడే కనిపించడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక అటు రష్యన్లు, ఇటు యుక్రేనియన్లు నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు దేశాలతో పాటు యుద్ధభారాన్ని మోస్తున్న మిగిలిన ప్రపంచమూ నిర్వేదంలో ఉంది. ఈ భయానక పరిస్థితుల్లోనే ప్రధాని మోదీ ఓ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.

PM Modi Japan Visit : హిరోషిమాలో రెండోరోజు.. అణుదాడిలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళి..

అణుబాంబు బాధిత నగరం హీరోషిమా వేదికగా శాంతిదూతగా మారారు ప్రధాని మోదీ. జీ 7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు హీరోషిమా వెళ్లిన ప్రధాని..బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. అయినప్పటికీ…యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో సమావేశమయ్యారు. యుక్రెయిన్ యుద్ధం మొదలయిన తర్వాత మోదీ, జెలన్‌స్కీ ఇలా ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గత ఏడాది ఓ సమావేశంలో యుద్ధంలో గెలిచేదెవ్వరూ ఉండదని చెప్పిన ప్రధాని…ఇప్పుడు కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని తాను రాజకీయ, ఆర్థిక కోణంలో చూడడం లేదని..మానవత్వం, విలువలకు ఇది సవాల్‌లాంటిదని మోదీ మాట్లాడారు. యుద్ధ పరిష్కారంలో భాగమవుతామని హామీఇచ్చారు. భారత్ తరపునే కాకుండా వ్యక్తిగతంగా కూడా పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తామని చెప్పారు. ఓ రకంగా రష్యా, యుక్రెయిన్ తరపున మధ్యవర్తిత్వం వహించేందుకు అంగీకరించారు.

యుద్ధం…రష్యా, యుక్రెయిన్ సమస్య మాత్రమే కాదని….ఇది ప్రపంచానికే పెద్ద సమస్యని మోదీ అన్నారు. యుద్ధం ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసిందన్న మోదీ మానవత్వం, మానవవిలువలకు సంబంధించిన ఈ సమస్యని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తానన్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత మోదీ, జెలన్‌స్కీ ఫోన్‌లో పలుమార్లు మాట్లాడుకున్నారు. వర్చువల్ సమావేశాల్లోనూ సంభాషించారు. కానీ ఇలా నేరుగా సమావేశమైంది ఇదే మొదటిసారి. రష్యాకు అనధికార మిత్రదేశంగా ఉన్న భారత్‌కు యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉందని మిగిలిన ప్రపంచమంతా భావిస్తోంది. భారత్, రష్యా మధ్య ఉన్న చిరకాల సాన్నిహిత్యం, రెండు దేశాలకు ఉన్న పరస్పర నమ్మకం…పుతిన్‌, మోదీ కొనసాగించారు. ఈ నేపథ్యం దృష్ట్యా మోదీ చెప్పే పరిష్కారమార్గాన్ని పుతిన్ తప్పకుండా అంగీకరిస్తారు. రష్యాకు, చైనాకు మధ్య కూడా మంచి స్నేహమే ఉన్నప్పటికీ…డ్రాగన్‌పై మిగిలిన ప్రపంచానికి నమ్మకం లేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ కూడా జిన్‌పింగ్‌ను నమ్మలేరు. జెలన్‌స్కీకి అమెరికాతో ఉన్న స్నేహం, అమెరికా, చైనాకు ఉన్న విభేదాలు….డ్రాగన్ మధ్యవర్తిత్వానికి ఆటంకాలుగా మారాయి. కానీ భారత్‌కు ఈ ప్రతిబంధకాలు లేవు. మన దేశానికి రష్యా, అమెరికా రెండింటితోనూ మంచి స్నేహం ఉంది. అందుకే యుద్ధాన్ని ఆపగల శక్తి ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ప్రపంచం మొత్తం మోదీ వైపు చూస్తోంది.