Owaisi : ‘అల్లా మీ అంతు చూస్తాడు జాగ్రత్త’ యూపీ పోలీసులకు ఒవైసీ వార్నింగ్

ప్రధాని మోదీ..సీఎం యోగీ అధికారంలో శాశ్వతంగా ఉండరు.. వారు వెళ్లిపోయాక..అల్లా మీ అంతు చూస్తాడు జాగ్రత్త అంటూ అసదుద్దీన్ఒవైసీ యూపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

Owaisi :  ‘అల్లా మీ అంతు చూస్తాడు జాగ్రత్త’ యూపీ పోలీసులకు ఒవైసీ వార్నింగ్

Owaisi Threat To Up Police

Owaisi Threat To UP Police : ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈక్రమంలో అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈక్రమంలో యూపీలో కూడా పాగా వేయాలనే ఉద్ధేశంతో.. ఎంఐఎం పార్టీ యూపీ ఎన్నికల పోటీలో నిలుస్తోంది. దీంట్లో భాగంగా..పోలీసులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగానే తీవ్రంగా హెచ్చరించారు. కాన్పూర్ సభలో ఒవైసీ మాట్లాడుతు.. ‘‘మోదీ, యోగీ పదవుల్లో శాశ్వతంగా ఉండరు..వారు అధికారంనుంచి వెళ్లిపోతారు. ఆ తరువాత ఎవరూ మిమ్మల్ని వారు కాపాడలేదు. అప్పుడు అల్లా మీ అంతం చూస్తాడు‘‘అంటూ తీవ్ర పదజాలతో పోలీసులపై ఒవైసీ విరుచుకుపడ్డారు. బహిరంగ సభ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగం చేస్తు ఒవైసీ తీవ్ర పదజాలంతో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఒవైసీ వ్యాఖ్యలకు సభకు హాజరైనవారు కూడా మద్దతు తెలుపుతు..చప్పట్లు కొట్టినట్లుగా వీడియోలో ఉంది.

Read more : Minister KTR : ‘నా పిల్లలపై బీజేపీ మీడియా థర్డ్‌ గ్రేడ్‌ నేతలు నీచమైన వ్యాఖ్యలు’ : మంత్రి కేటీఆర్

ఇంకా ఒవైసీ మాట్లాడుతు..‘పోలీసు అధికారులకు నేను ఒకటి గుర్తు చేస్తున్నా..సీఎంగా యోగీ, ప్రధానిగా మోదీ ఆ పదవుల్లో శాశ్వతంగా ఉండరు. యోగీ వెళ్లిపోతారు. మోదీ కూడా వెళ్లిపోతారు. మరి ఎవరు వస్తారు? ముస్లింలే కచ్చితంగా అధికారంలో వచ్చి తీరుతారు. గెలుపు సాధిస్తాం..అధికారంలోకి వస్తాం..కానీ..ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు ముస్లింలను వేధిస్తున్నారు. వాటిని మేము మర్చిపోయే ప్రసక్తే లేదు. అన్నీ గుర్తుంచుకుంటాం.అల్లా తన శక్తితో మిమ్మల్ని అంతం చేస్తాడు’’ అని వార్నింగ్ ఇచ్చారు.అంతేకాదు..‘‘కాన్పూర్‌లో భజరంగ్ దళ్ గూండాలు ఓ ముస్లిం ఆటోరిక్షా డ్రైవర్ ని దారుణంగా కొట్టారని.. తన తండ్రిని రక్షించుకోవడానికి ఆమయన కుమార్తె ఎంతలా పోరాడిందో మేము మరచిపోలేదని.. మేము గుర్తుంచుకుంటాము. ఆమె కూడా నా కూతురే” అని ఒవైసీ తీవ్ర ఆగ్రహంతో పోలీసుల్ని హెచ్చరించారు.

Read more : విడాకులు తీసుకున్న వ్యక్తిని 8000 ఏళ్ల పాటు దేశంలోనే నిర్బంధించిన “ఇజ్రాయెల్” దేశం

ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తీవ్రంగా మండిపడ్డారు. ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను విడుదల చేస్తూ..బీజేపీ నేతలకు గట్టిగానే సమాధానమిచ్చారు. ‘‘ఇది భారతదేశం..పాకిస్థాన్ కాదని, ఇక్కడ తాలిబన్లకు చోటు లేదని కౌంటర్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలతో సమాజానికి ఎటువంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు ఒవైనీ? అంటూ అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాన్ నఖ్వి ప్రశ్నించారు.