Girl Rape : డబ్బులు తీసుకో…చెప్పుతో కొట్టి నిన్ను అత్యాచారం చేసినవాడిని వదిలేయ్

13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన ఆ యువకుడిని శిక్షించకుండా ఆ చిన్నారి జీవితానికి వెలకట్టాడు పంచాయతీ పెద్దలు. ఇచ్చిన డబ్బులు తీసుకో..నీపై అత్యాచారం చేసినవాడిని చెప్పుతో కొట్టి నీ కసి తీర్చుకో..అంతేగానీ పోలీసులకకు మాత్రం చెప్పొద్దు అంటూ తీర్పు తీర్చారు గ్రామ పెద్దలు.

Girl Rape : డబ్బులు తీసుకో…చెప్పుతో కొట్టి నిన్ను అత్యాచారం చేసినవాడిని వదిలేయ్

Up Girl Rape

UP Girl Rape case : ఓ బాలిక జీవితాన్ని చిదిమేశాడు ఓ కామాంధుడు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన ఆ యువకుడిని శిక్షించకుండా ఆ చిన్నారి జీవితానికి వెలకట్టాడు పంచాయతీ పెద్దలు. మేం ఇచ్చిన డబ్బులు తీసుకో..నీపై అత్యాచారం చేసినవాడిని చెప్పుతో కొట్టి నీ కసి తీర్చుకో..అంతేగానీ పోలీసులకకు మాత్రం చెప్పొద్దు అంటూ తీర్పు తీర్చారు గ్రామ పెద్దలు. ఈ దారుణ ఘటన నేరాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లాలో జూన్ 23న కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువకుడు పొలంలో కూరగాయలు కోస్తున్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికన్నా చెబితే నిన్ను నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి.. ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో తన కూతురు జీవితాన్ని నాశనం చేసిన సదరు యువకుడిపై బాధితురాలి కుటుంబం పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసింది.

దీంతో సదరు యువకుడిని పిలిపించి పెద్దలు బాధితురాలినే తిరిగి అవమానించారు. అత్యాచారం చేయటం తప్పే గానీ..ఆ తప్పుకు నిందితుడికి రూ.50 వేలు జరిమానా వేస్తున్నామనీ..ఐదు చెప్పు దెబ్బలు శిక్ష వేసి వదిలేశారు. రూ.50వేలు తీసుకుని నీపై అత్యాచారం చేసిన వాడిని నీ కోపం తీరేలా చెప్పుతో కొట్టి ఈ విషయం ఇంతటితో వదిలేయ్..పోలీసులకు ఫిర్యాదుల్లాంటివేమీ పెట్టుకోవద్దు అంటూ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారు.దీంతో స్వంత గ్రామస్తులే ఓ ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి డబ్బులతో వెల కడతారా? అంటూ బాలిక మనస్తాపానికి గురైంది. ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా.

పంచాయితీ పెద్ద తీర్పుతో మనస్థాపానికి గురైన ఆ కుటుంబం జూన్ 25న పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై స్పందించిన పోలీసులు స్పందించిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ తాము వద్దు అంటున్నా..మీరు పోలీసులకు ఫిర్యాదు చేసి గ్రామం పరువు తీస్తారా? అంటూ పెద్దలు బాధితురాలి కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.