Coronavirus India : భారత్ లో కరోనా కట్టడికి లాన్సెట్ సిటిజన్స్ 8 కీలక సూచనలు
భారత్‌లో కరోనా కట్టడికి ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌కు చెందిన సిటిజన్స్ కమిషన్ కీలక సూచనలు చేసింది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన తక్షణ చర్యలను సూచిస్తూ.. యామిని అయ్యర్ నేతృత్వంలోని ఓ బృందం లాన్సెట్‌లో వ్యాసాన్ని ప్రచురించింది. ఇందులో భారత్‌లో వైరస్‌ను నియంత్రించడం కోసం 8 ప్రతిపాదనలు చేసింది.

Coronavirus India Lancet
Lancet Citizens’ Commission : భారత్‌పై కోవిడ్ సెకండ్ వేవ్ ప్రతాపం చూపుతోంది. లక్షల్లో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ను వైరస్ భయపెడుతుండడంతో ప్రపంచ దేశాలు సంఘీభావం ప్రకటించాయి. అనేక దేశాలు సాయం చేయడానికి సైతం ముందుకు వచ్చాయి. అయితే కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ కేసులతో పాటు మరణాలు తగ్గుతున్నాయి. ఈక్రమంలో భారత్‌లో కరోనా కట్టడికి ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌కు చెందిన సిటిజన్స్ కమిషన్ కీలక సూచనలు చేసింది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన తక్షణ చర్యలను సూచిస్తూ.. యామిని అయ్యర్ నేతృత్వంలోని ఓ బృందం లాన్సెట్‌లో వ్యాసాన్ని ప్రచురించింది. ఇందులో భారత్‌లో వైరస్‌ను నియంత్రించడం కోసం 8 ప్రతిపాదనలు చేసింది.
టీకాల కొనుగోలు, ఉచితంగా పంపిణీ కోసం ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని లాన్సెట్ కమిషన్ సూచించింది. అలాగే రానున్న రోజుల్లో కేసులు అధికమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా పూర్తిస్థాయి సమాచారాన్ని స్థానిక యంత్రాంగాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలియజేసింది.
లాన్సెట్ నిపుణుల బృందం చేసిన ప్రతిపాదనల్లో మొదటిది సాంకేతికను పెద్ద ఎత్తున వినియోగించుకోవడం. దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్యకు, దేశంలో అందుబాటులో ఉనన వైద్య వసతులకు ఎక్కడా పొంతన ఉండటం లేదని లాన్సెట్ బృందం అభిప్రాయపడింది. అందుకే సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించింది. తద్వారా ఔషధాలు, బెడ్లు, ఆక్సిజన్‌లాంటి వసతులు నిర్వహణలో ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపింది.
క్షేత్రస్థాయి వరకు వైద్యం చేరేలా వైద్య సేవలను మరింత వికేంద్రీకరించాలని రెండో ప్రతిపాదన చేసింది లాన్సెట్ నిపుణుల బృందం. క్షేత్రస్థాయి వరకు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలంతా కోవిడ్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడతారని సూచించింది. లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే వైద్యం అందిస్తే ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని తెలిపింది. అందుకే వైద్య సేవలను మరింతగా వీకేంద్రీకరించాలని అభిప్రాయపడింది.
ఔషధాలు , వైద్య పరికాల బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు తీసుకోవాలని మరో సూచన చేసింది ఎక్స్‌ఫర్ట్ టీమ్. మెడిసిన్స్, వైద్య పరికరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. వీటన్నింటి ధరలపై పరిమితి విధించాలని సూచించింది. తద్వారా కరోనా వైద్యం కాస్ట్‌లీ కాకుండా చేయవచ్చని.. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు.
టెలీ మెడిసిన్ సేవలను మరింత విస్తృతం చేయాలని కూడా లాన్సెట్ నిపుణులు బృందం సూచించింది. తద్వారా హాస్పిటల్స్‌పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ఇక ప్రైవేట్ , ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యపరమైన మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కూడా సూచింది. ఇందుకోసం ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కోవిడ్ సేవలకు వినియోగించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది.
టీకాల కొనుగోలు, ఉచితంగా పంపిణీ కోసం ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని లాన్సెట్ కమిషన్ సూచించింది. దీని ద్వారా ప్రజలందరికీ త్వరగా టీకాలు వేయవచ్చని తెలిపింది. టీకా వృధాను కూడా అరికట్టడానికి వీలవుతుందని తెలిపింది.
ఇక రానున్న రోజుల్లో కేసులు అధికయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా…. చర్యలు తీసుకోవాలని సూచించింది. కేసులు ఎక్కువగా నమోదయ్య ప్రాంతాలకు చెందిన సమాచారాన్ని స్థానిక యంత్రాంగాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలియజేసింది.
జిల్లా స్థాయి హెల్త్ టీమ్‌లకు మారుతున్న కోవిడ్ పరిస్థితులపై వేగంగా స్పందించడానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కూడా లాన్సెట్ టీమ్ సూచించింది. తద్వారా ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా స్థాయి టీమ్‌లు వేగంగా స్పందిస్తాయని.. తద్వారా కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే వైరస్ కట్టడి సాధ్యమవుతుందని తెలిపింది.
Read More : Hyderabad News: హైదరాబాద్ నగరంలో అల్లరిమూకలు హల్ చల్.. రోడ్డున పోయే వారిపై దాడి