పౌర సవ”రణం” : ఢిల్లీలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 09:45 AM IST
పౌర సవ”రణం” : ఢిల్లీలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్

దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. అటు.. మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు.

శాంతి భద్రతలను అదుపులో ఉంచడం కోసం.. వాయిస్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. ఈ మేరకు తమకు ఆదేశాలు అందిన మాట వాస్తవమే అని వొడాఫోన్, ఎయిర్ టెల్ టెలికాం కంపెనీలు తెలిపాయి. ఢిల్లీలోని సీలమ్ పూర్, బ్రిజ్ పూర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. ఉదయం 9 నుంచి మ.1 గంట వరకు అన్ని రకాల సర్వీసులు నిలిపేశామని.. మధ్యాహ్నం 2.28కి రెస్టోర్ చేసినట్టు అధికారులు తెలిపారు. మండీ హౌస్, సీలమ్ పూర్, జాఫర్ బాద్, ముస్తాఫబాద్, జామియా నగర్, బవానా ప్రాంతాల్లో వాయిస్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవలకు నిలిపివేసినట్టు చెప్పారు.

* పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా ఆందోళనలు
* నిరసనలతో అట్టుడికిన ఢిల్లీ
* ఎర్రకోట దగ్గర ఆందోళనకారుల నిరసన
* ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్
* సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ఢిల్లీ సర్కార్ ఆదేశం
* ఢిల్లీవ్యాప్తంగా 20 మెట్రో స్టేషన్లు మూసివేత
* పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి వస్తున్న ఆందోళనకారులు
* అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ.. ఢిల్లీలో భద్రత పెంపు
* ఎర్రకోట, మండిహౌజ్ ప్రాంతాల్లో 144 సెక్షన్
* పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
* ముంబై, గుజరాత్, బెంగళూరు, యూపీలోనూ నిరసనలు
* యూపీలోని సంబల్ లో 2 ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

Also Read : చూయింగ్ గమ్ లో మహిళా DNA