VVS Laxman: పిల్లి పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకున్న కుక్క.. ఆసక్తికర వీడియోను ట్వీటర్‌లో షేర్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్

భారత మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

VVS Laxman: పిల్లి పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకున్న కుక్క.. ఆసక్తికర వీడియోను ట్వీటర్‌లో షేర్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్

dog taking care cat babies

VVS Laxman: భారత మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. భావోద్వేగానికి గురిచేసే ఈ వీడియోలో అనాథలుగా మారిన పిల్లి పిల్లలను కుక్క హక్కున చేర్చుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 50వేల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు.

Vehicle Theft: దేశంలో ఎక్కువ వాహన దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా..? సేఫ్‌‌ప్లేస్‌లో హైదరాబాద్‌

తల్లి పిల్లి మరణించడంతో దాని రెండు పిల్లులు అనాథలుగా మారాయి. దీంతో కుక్క వాటిని హక్కున చేర్చుకుంది. రోడ్డు పక్కన దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న రెండు చిన్న పిల్లులను ఆ కుక్క నోటకర్చుకొని ఓ దగ్గరికి చేర్చింది. వాటిని తన దగ్గరే ఉంచుకొని ఆలనాపాలనా చూస్తుంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లిప్రేమ అద్భుతం అంటూ భావోద్వేగపూరితమైన రీట్వీట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. వీటి నుండి మనం నేర్చుకోవాలి. మానవత్వానికి పాఠం అంటూ పేర్కొన్నారు. మరో నెటిజన్.. మదర్లీ మూమెంట్స్ అంటూ రాశారు.

ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన వీవీఎస్ లక్ష్మణ్.. ‘పిల్లి తల్లి మరణించిన తర్వాత పిల్లి పిల్లలను చూసుకుంటున్న కుక్క తల్లి.. అన్ని జీవుల తల్లులందరికీ కృతజ్ఞతలు’ అంటూ పేర్కొన్నాడు.