White Tigers : గ్వాలియర్ గాంధీ జూపార్క్ లో మూడు కూనలకు జన్మనిచ్చిన తెల్ల పులి

తెల్ల పులి మీరా 2013లో ఇదే జూ పార్క్ లో జన్మించదని వెల్లడించారు. పదేళ్లల్లో అది మూడు సార్లు పిల్లలకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు.

White Tigers : గ్వాలియర్ గాంధీ జూపార్క్ లో మూడు కూనలకు జన్మనిచ్చిన తెల్ల పులి

White Tigress

White Tigers : మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని గాంధీ జూ పార్క్ లో మీరా అనే తెల్ల పులి మూడు కూనలకు జన్మనిచ్చింది. దీంతో ఈ జూపార్క్ లో పులల సంఖ్య పదికి చేరింది. గురువారం ఉదయం 11.30 గంటలకు తెల్ల పులి మూడు పిల్లలకు జన్మనిచ్చిందని జూ క్యూరేటర్ డా.గౌరవ్ పరిహార్ పేర్కొన్నారు. వీటిలో ఒకటి తెల్ల పులి పిల్ల అని తెలిపారు. తల్లి పులితో పాటు పులి కూనలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు.

ప్రత్యేక ఎన్ క్లోజర్ లో ఉంచి వాటిని సంరక్షిస్తున్నామని పేర్కొన్నారు. తెల్ల పులి మీరా 2013లో ఇదే జూ పార్క్ లో జన్మించదని వెల్లడించారు. పదేళ్లల్లో అది మూడు సార్లు పిల్లలకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు.గ్వాలియర్ లోని గాంధీ జూపార్క్ ను 8 హెక్టార్ల విస్తీర్ణంలో 1992లో నిర్మించారు.

White Tigress: ఢిల్లీ జూలో అతిపెద్ద తెల్ల పులి మృతి.. అనారోగ్యమే కారణమా?

దీనికి భారత్ లోనే అతి పెద్ద జూలాజికల్ పార్కుల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఈ పార్క్ సాధారణంగా కనిపించే అడవి జంతువులతోపాటు అరుదైన జాతులకు నిలయంగా ఉంది. అరుదైన జంతువులు ఉండటంతో దీనిని రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. గాంధీ జూపార్క్ లో తెల్ల పులి, గోల్డెన్ నెమలి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.