జామియా వర్శిటీలో కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులెవరిచ్చారు? : రాహుల్ గాంధీ

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 08:56 AM IST
జామియా వర్శిటీలో కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులెవరిచ్చారు? : రాహుల్ గాంధీ

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులు ఎవరి ఇచ్చారు? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న శుక్రవారం (జనవరి 30,2020)న జామియా వర్శిటీలో విద్యార్దులు నిరసన వ్యక్తం చేస్తుండగా హఠాత్తుగా ఓ వ్యక్తి ‘‘స్వేచ్చ కావాలనుకుంటున్నారు కదూ అయితే తీసుకోండి’’అంటూ  విద్యార్ధులపై పిస్టల్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్ధికి గాయాలయ్యాయి. 

ఈ  ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ..కాల్పులు జరిపిన వ్యక్తికి ‘‘డబ్బులు ఎవరు చెల్లించారంటూ?’’ ప్రశ్నించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో పార్లమెంటు  ఆవరణలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ ప్రశ్నలు వేశారు. 
 
మరోవైపు వర్శిటీలో కాల్పుల ఘటనపై ప్రియాంక గాంధీ కూడా ట్విటర్లో  స్పందిస్తూ..మోడీ ప్రభుత్వంపై  ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కాల్చిపారేయాలి అంటూ బీజేపీ నేతలు, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? అని అడిగితే మోడీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రా? వాళ్లు హింస వైపు నిలబడతారా, అహింస వైపు నిలబడతారా? అభివృద్ధి వైపు నిలబడతారా? అల్లర్ల వైపు నిలబడతారా?’’ అంటూ ప్రశ్నించారు.