కరోనా రోగుల్లో మగవారే ఎక్కువ ఎందుకు ? సిగరేట్స్ పీల్చే వారికి మరింత ప్రమాదమా

  • Published By: madhu ,Published On : March 30, 2020 / 02:25 AM IST
కరోనా రోగుల్లో మగవారే ఎక్కువ ఎందుకు ? సిగరేట్స్ పీల్చే వారికి మరింత ప్రమాదమా

కరోనా వైరస్ ఎక్కువగా మగవారినే బలి తీసుకుంటుందా ? మహిళలకు రిస్క్ తక్కువా ? పొగతాగే అలవాటున్న వారికి మరింత ప్రమాదకరమా ? ఇలాంటి డౌట్స్ కొందరి మదిలో మెదలుతున్నాయి. ఎందుకంటే..కరోనా వైరస్ మహమ్మారిన పడి..ఎంతో మంది చనిపోతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రోగం..ప్రపంచాన్ని చుట్టేసింది. ఆ దేశం..ఈ దేశం అనేది ఏదీ లేదు. కానీ చనిపోతున్న వారిలో మగవారే ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 71 శాతం మగవారే ఉన్నట్లు అంతర్జాతీయ కరోనా అప్ డేట్స్ ను అందించే ‘వరల్డ్ మీటర్’ అనే వెబ్ సైట్ నివేదిక వెల్లడించింది. కరోనాతో  మహిళలకు రిస్క్ తక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రధానంగా పొగ తాగే అలవాటు ఉండడం, కాలుష్యానికి అధికంగా ప్రభావితం కావడం తదితర కారణాలతో మగవారిలో శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడడం వల్ల కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.

చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) అంచనాల ప్రకారం..మరణించిన వారిలో 80 శాతం మంది 60 సంవత్సరాలకు పైబడిన వారు..ఇందులో 75 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్ తదితర రోగాలు ఉన్నాయని తెలిపింది. 71 శాతం మంది ఈ రాకాసి కి మగవారు ప్రభావితం అవుతున్నారని, కానీ..కరోనా వైరస్ అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తోందని తెలిపింది. ప్రధానంగా వృద్ధులు, ఉబ్బసం, డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఈ వ్యాధి వెంటనే సోకే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడిస్తోంది. 

చైనాతో పాటు..ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారు..70 ఏళ్లకు పైబడిన వారు 29.9 శాతం ఉండగా..ఇందులో పిల్లలు చాలా తక్కువ కరోనా కేసులు కనిపిస్తున్నాయని వెల్లడించింది. సిగరేట్లు తాగడం వల్ల శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని నివేదిక హెచ్చరించింది. కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే..పురుషుల్లో మరణా రేటు 4.7 శాతం, మహిళల్లో 2.8 శాతంగా మరణ రేటు ఉందని తేల్చింది.