Marriage : ఇదేం పెళ్లిరా బాబు.. కర్రలతో కొట్టుకున్న వధూవరులు.. వైరల్ వీడియో

భారత్ అనేక భాషలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి రోజు ఎదో ఒక పండుగ ఉంటుంది.

Marriage : ఇదేం పెళ్లిరా బాబు.. కర్రలతో కొట్టుకున్న వధూవరులు.. వైరల్ వీడియో

Marriage

Marriage : భారత్ అనేక భాషలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి రోజు ఎదో ఒక పండుగ ఉంటుంది. భిన్న సంస్కృతులు వేషధారణలు కలిగిన ఈ దేశంలో కొన్ని విషయాలు అందరి దృష్టిని ఆకరిస్తుంటాయి. కొత్త సాంప్రదాయాలు, వేడుకలు కంటబడినప్పుడు వాటిని తదేకంగా చూస్తూ ఉండిపోతారు. ప్రాంతాన్ని బట్టి మారే ఆచార సాంప్రదాయాలు అందరి దృష్టిని అమితంగా ఆకర్శితాయి. అయితే పెళ్లి వేడుకలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.

Read More :  మోదీ నియంతనా? విమర్శకులకు అమిత్ షా సమాధానం ఇదే

పెళ్లిళ్లు ఆచారాలు.. దేశంలో అనేక ప్రాంతాల్లో వివిధ రకాలుగా వివాహ వేడుకలు జరుగుతాయి. కొన్ని సార్లు ఈ ఆచారాలు చాలా సరదాగా ఉంటాయి. ప్రస్తుతం, ఇలాంటి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వధువరులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. పక్కన ఉన్నవారు గట్టిగ కొట్టండి అంటూ కేకలు వేస్తున్నారు. సన్నిసైని అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Read More :  సాయి భక్తులకు శుభవార్త.. ప్రారంభమైన విమాన సేవలు

పానిపట్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు బిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఎలాగైనా పోట్లాడుకోవాలి కాబట్టే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారని కొందరంటే.. యువకుడు గట్టిగా కొట్టడం లేదు.. ఆమె అంటే ఏంటో ప్రేమో అని మరికొందరు అంటున్నారు. పానిపట్ ప్రాంతంలో పెళ్లి తర్వాత దీనిని ఓ ఆచారంగా భావిస్తారని తెలుస్తోంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by TONNY SAINI (@sunnysaini038)