Cooking Oil Prices: వంట నూనెల ధరలు తగ్గనున్నాయా? కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..
దేశంలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో వంట నూనెల ధరలు పెరిగాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌ను...

Cooking Oil Prices: దేశంలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో వంట నూనెల ధరలు పెరిగాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌ను భారీగా ఉత్పత్తి చేసే రష్యా, ఉక్రెయిన్ నుంచి కూడా సప్లయ్ ఆగిపోవడంతో ఆ నూనె ధరలు అమాంతం పెరిగాయి. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో పేద వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. ఈ క్రమంలో గత నెల భారత్‌కు ఇండోనేషియా షాకిచ్చింది. భారత్‌కు పామాయిల్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే ఇండోనేషియా.. దాని ఎగుమతులపై ఏప్రిల్ 28నుంచి నిషేధం విధించాలని నిర్ణయించింది. ధరలను తగ్గించడానికి వంట నూనెలతో పాటు ముడి సరుకుల షిప్మెంట్లను కూడా నిలిపేస్తామని ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ప్రకటించిన విషయం విధితమే.
Edible Oil: దేశంలో సరిపడా నూనె నిల్వలున్నాయి: కేంద్రం
ఇండోనేషియా నుంచి మన దేశం ఎక్కువగా పామాయిల్ కొంటోంది. ఆ దేశం పామాయిల్ ఎగుమతులను బ్యాన్ చేయడం వల్ల మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ నూనెల ధరలు పెరుగుతాయి. ఇండోనేషియాతో పాటు మలేషియాలోనూ పామాయిల్ ఉత్పత్తితగ్గింది. డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి పామాయిల్ ధరలు బాగా పెరిగాయి. పామాయిల్ ఎగుమతుల్లో 50శాతం వాటా ఇండోనేషియాదే కావడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధంతో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోవడంతో పామాయిల్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!
ఇటీవలి ఇండోనేషియా ముడి పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించిన తరువాత ధరల పెరుగుదలను తగ్గించడానికి ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది భారతదేశం యొక్క వస్తువుల దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉంది. పామాయిల్ సరఫరా కోసం భారతదేశం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నందున వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 5%, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ (AIDC)లో కోత ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపితే కొంత మేర నూనె ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Cooking Oil Prices : యుక్రెయిన్-రష్యా యుద్ధం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న వంటనూనెల ధరలు
ఇదే విషయంపై బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబన్విస్ మాట్లాడుతూ.. సెస్సు తగ్గింపు వినియోగదారుల ధరలను తగ్గించడానికి కొంతవరకు సహాయపడుతుందని తెలిపారు. అయినప్పటికీ ఇంకా పామాయిల్లో కొరతను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. సెస్సు తగ్గింపు వల్ల ధర లీటరుకు ₹2-3 కంటే ఎక్కువ తగ్గకపోవచ్చునని ఆయన అభిప్రాయ పడ్డారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారు ఇండోనేషియాతో భారతదేశం దౌత్య మార్గాల ద్వారా పరస్పర చర్చలు జరిపే అవకాశం ఉందని, ఇండోనేషియా దేశంలో పామాయిల్ సరఫరా పై విధించిన నిషేధాన్ని కొన్ని వారాల వ్యవధిలో వెనక్కి తీసుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అదే జరిగితే వంట నూనెల ధరలు తగ్గుతాయని తెలిపారు.
- Indonesia Bus Crash: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో 15 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు
- Ap cm jagan : అలా చేయండి.. కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి
- Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!
- Cooking Oil Prices : యుక్రెయిన్-రష్యా యుద్ధం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న వంటనూనెల ధరలు
- Ukraine Crisis : యుక్రెయిన్ సంక్షోభం.. మన వంటిల్లు ఇక భారమే.. ఎందుకంటే?
1Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
2Zelensky : ఆంక్షలతోనే రష్యా ఆటకట్టు.. ఆయుధాలు ఇవ్వాలన్న జెలెన్స్కీ..!
3Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి
4Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
5Balakrishna : ఆగని ‘అఖండ’ అరాచకం.. 175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న అఖండ..
6Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
7Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
8Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
9Tirumala Devotees Cheated: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం
10Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. ఆందోళనలో అభిమానులు..
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
-
Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు