ప్రపంచ కప్ భారత్ అమ్మేసుకుందా : విచారణకు లంక ప్రభుత్వం ఆదేశం

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 03:03 AM IST
ప్రపంచ కప్ భారత్ అమ్మేసుకుందా : విచారణకు లంక ప్రభుత్వం ఆదేశం

భారత్‌ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల అంశం మరో మలుపు తీసుకుంది. ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేసుకుందంటూ శ్రీలంక మంత్రి మహిందానంద  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నిజనిర్ధారణ కోసం శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల పాత్ర లేదని కొన్ని పార్టీలు పాలుపంచుకున్నాయన్న నేపథ్యంలో.. నిజానిజాలేంటో తెలుసుకునేందుకు లంక క్రీడా శాఖ మంత్రి దుల్లాస్‌ సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. విచారణకు సంబంధించిన వివరాలను ప్రతి రెండు వారాలకోసారి నివేదిక సమర్పించాలని ఆయన కోరారు.  మంత్రి మహిందానంద ఆరోపణల్లో ఉన్న అసలు వాస్తవాలేంటో దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

2011 క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం ఇనాటిది కాదు. గతంలోనూ ఈ అంశం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. సరిగ్గా మూడేండ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ..వరల్డ్‌కప్‌ తుదిపోరుపై విచారణ జరపాలంటూ డిమాండ్‌ చేశాడు. అప్పటి ఫైనల్‌ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ మాజీ కెప్టెన్‌ లంక ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెప్పుకొచ్చాడు.

ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడేం చెప్పలేను, కానీ ఏదో ఒక నాడు నిజం బయటపెడుతాను. అందుకే దీనిపై విచారణ జరుపాలనుంటున్నాను’ అని రణతుంగ అన్నాడు. మళ్లీ ఇన్ని రోజులకు అప్పటి క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించిన మహిందానంద ఆరోపణలకు దిగారు. భారత్‌కు లంక ప్రపంచకప్‌ అమ్ముకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇవి ఇప్పుడు ఈ దేశంలో  కలకలం రేపుతున్నాయి.

Read: చైనా కంపెనీలతో లింకులు తెంచేసుకున్న BCCI, IOA