Yashika Aannand : రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫేమ్‌కి తీవ్రగాయాలు, హైదరాబాదీ ఫ్రెండ్ మృతి

రోడ్డు ప్రమాదంలో తమిళ్ బిగ్‌బాస్ ఫేమ్, నటి యాషికా ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మామల్లపురం సమీపంలో కారు ప్రమాదం జరిగింది.

Yashika Aannand : రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫేమ్‌కి తీవ్రగాయాలు, హైదరాబాదీ ఫ్రెండ్ మృతి

Yashika Aannand

Yashika Aannand : రోడ్డు ప్రమాదంలో తమిళ్ బిగ్‌బాస్ ఫేమ్, నటి యాషికా ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మరో మహిళ స్పాట్ లోనే చనిపోయారు. యాషికా కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాషికా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రమాదానికి కారణం తెలుసుకునే పనిలో ఉన్నారు.

ఇక ఈ కారు ప్రమాదంలో నటి యాషికతో ప్రయాణిస్తున్న ఇద్దరు మగ స్నేహితులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. మెరుగైన చికిత్స కోసం వారిని చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో మృతి చెందిన మరో మహిళను హైదరాబాద్‌కు చెందిన వల్లిశెట్టి భవానీ (28)గా గుర్తించారు. ఆమె యాషికా ఫ్రెండ్. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం భవానీ మృతదేహాన్ని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జూలై 25 అర్థరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం జరిగింది. యాషికా ప్రయాణిస్తున్న ఎస్ యూవీ ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో కారుని డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు అక్కడికి వెళ్లారు. వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఇరుక్కుపోయి ఉన్నారు. వారందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, యాషికా ఫ్రెండ్ భవానీ కారులో ఇరుక్కుపోయింది. పోలీసులు వచ్చే వరకు ఆమెను స్థానికులు బయటకు తియ్యలేకపోయారు. పోలీసులు సాయంతో ఆమెను వాహనం నుంచి బయటకు తీశారు. తీవ్ర గాయాలు కావడంతో భవానీ స్పాట్ లోనే చనిపోయింది.

యాషికా ఆనంద్ తమిళనాడులో పాపులర్ మోడల్. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో నటిస్తోంది. అంతేకాకుండా పలు రియాలిటీ షోల్లో కూడా పాల్గొని పాపులర్ అయ్యింది. యాషికా ఢిల్లీలో పుట్టి… చెన్నైలో సెటిల్ అయ్యింది. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ఫ్యామిలీ నటి… 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్‌గా మారింది. 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో పలకరించింది. అలాగే బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

yashika