Karnataka Politics: ప్రభుత్వం ఏర్పడి 34 మంత్రులు వచ్చినా ప్రతిపక్ష నేత ఎవరో తేల్చుకోని బీజేపీ

Karnataka Politics: ప్రభుత్వం ఏర్పడి 34 మంత్రులు వచ్చినా ప్రతిపక్ష నేత ఎవరో తేల్చుకోని బీజేపీ

Leader of the Opposition: కర్ణాటక ఎన్నికల్లో దారుణ పరాభవం పొందిన భారతీయ జనతా పార్టీకి విపక్ష నేతను ఎన్నుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 34 మంది మంత్రులను భర్తీ చేసింది. అనంతరం ప్రభుత్వ పనులు చకచకా జరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీలో తమ నాయకుడు ఎవరో ఇప్పటికీ బీజేపీ తేల్చలేకపోయింది. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటిల్ లాంటి నేతల పేర్లు వినిపించినప్పటికీ ఇప్పటికీ ఎవరో ఫైనల్ కాలేదు.

Odisha Train Accident: విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామా కోరుతుంటే శభాష్ అంటూ సపోర్ట్ చేసిన మాజీ ప్రధాని

మే 13న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 135 స్థానాలేని తిరుగులేని మెజారిటీ సాధించింది. ఇక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య అంచలంచెలుగా ప్రభుత్వాన్ని గాడిన పెట్టే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ సహా 8మంది సీనియర్లను కేబినెట్‌లో చేర్చుకున్నారు. ఇది గడిచిన వారం రోజులకే మిగిలిన అన్ని స్థానాలకు మంత్రులను భర్తీ చేశారు. ప్రస్తుతం సిద్దరామయ్య కేబినెట్‌ 34 మందితో పూర్తి స్థాయిలో మంత్రి మండలి ఏర్పడింది. మరోవైపు శాఖల కేటాయింపులోనూ ఆయన దూకుడుగానే ఉన్నారు.

MSME: తెలుగు రాష్ట్రాల్లో MSME వృద్ధికి రూ.800 కోట్లకు పైగా ఇవ్వనున్న కినారా క్యాపిటల్

అధికార కాంగ్రెస్ పార్టీ ఇంత వేగంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష స్థానంలో ఉండే బీజేపీ, అసెంబ్లీలో తన పార్టీ నేతను నేతను ఎంచుకునేందుకు మల్లగుల్లాలు పడుతోంది. సిద్దరామయ్య పథకాల అమలులోనే కాకుండా సొంత పార్టీకి చెందినవారిని కలుపుకుపోవడంలో తిరుగులేదనే పేరు పొందారు. శాసనసభలో గడిచిన పదేళ్లలో సిద్దరామయ్యను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆచి తూచి వ్యవహరించాలనీ భావించేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కావడంతో ఆయన మాటల ధాటికి ధీటుగా ఎదుర్కొనే నేత ఎవరనే ప్రశ్నకు విపక్ష కమలదళం నుంచి సమాధానమే లేకుండా పోతోంది.