Cong Proposed Rahul As Party Chief: రాహుల్ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం

ఈ రేసులో తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గెహ్లోత్, థరూర్ మధ్య పోటీ ఉంటుందనే చర్చలు సైతం ఆ మధ్య బాగానే కొనసాగాయి. అయితే తాజా ప్రతిపాదనతో మళ్లీ రాహుల్‭నే ముందుకు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్.. ఈ విషయమై స్పందించలేదు. అయితే ఇంతకు ముందు పలు సందర్భాల్లో అయితే అధ్యక్ష పదవికి సముఖంగా లేనట్టే సంకేతాలు ఇచ్చారు.

Cong Proposed Rahul As Party Chief: రాహుల్ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం

Chhattisgarh and Rajasthan Cong proposed Rahul as party chief

Cong Proposed Rahul As Party Chief: రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలంటూ రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలు ఆదివారం తీర్మానం చేశాయి. రాజస్తాన్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాలు ఈ తీర్మానం చేశాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, తామ అభిలాషను ప్రస్తుత పరిస్థితిని బట్టి తీర్మానాలైతే చేశాం కానీ, అధ్యక్ష పదవిపై రాహుల్‭కు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆయన ఇష్టానుసారమే తర్వాతి పరిణామాలు ఉంటాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోత్, భూపేష్ బాఘేల్ అన్నారు.

మొదట రాజస్తాన్ కాంగ్రెస్ కమిటీ ఈ తీర్మానం చేసింది. అనంతరం ఛత్తీస్‭గఢ్ కాంగ్రెస్ కమిటీ సైతం చేసింది. ఇదే వరుసలో మిగిలిన రాష్ట్రాలు కూడా వెళ్లొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు ఉంటాయని పార్టీ ప్రకటించింది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఆ పదవిని అలంకరించబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అశోక్ గెహ్లోతే స్వయంగా రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ పార్టీ చేత ఏకగ్రీవ తీర్మానం చేయించడం గమనార్హం.

ఇక ఈ రేసులో తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గెహ్లోత్, థరూర్ మధ్య పోటీ ఉంటుందనే చర్చలు సైతం ఆ మధ్య బాగానే కొనసాగాయి. అయితే తాజా ప్రతిపాదనతో మళ్లీ రాహుల్‭నే ముందుకు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్.. ఈ విషయమై స్పందించలేదు. అయితే ఇంతకు ముందు పలు సందర్భాల్లో అయితే అధ్యక్ష పదవికి సముఖంగా లేనట్టే సంకేతాలు ఇచ్చారు.

Chandigarh University: తోటి విద్యార్థినుల నగ్నవీడియోలు తీస్తూ ఆన్‭లైన్‭లో అప్‭లోడ్.. ఇప్పటికే 60కి పైగా.. అట్టుడికి పోతున్న యూనివర్సిటీ